»   » వాళ్లు చేయట్లేదా? చిరంజీవి రొమాన్స్ చేస్తే తప్పేంటి?

వాళ్లు చేయట్లేదా? చిరంజీవి రొమాన్స్ చేస్తే తప్పేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 63 ఏళ్ల వయసులో 'కొచ్చాడయాన్' చిత్రంలో నటించడమే ఎక్కువ...ఆయన చివరి సినిమా అదే అని అంతా అనుకున్నారు. కానీ అందరి ఆశ్చర్య పరుస్తూ, నాలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపిస్తూ ఇటీవల 'లింగా' అనే మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు రజనీ.

ఈ సినిమాలో ఒక్కరుకాదు..ఏకంగా ఇద్దరు హాట్ హీరోయిన్లు అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హాలతో రొమాన్స్ చేయబోతున్నాడు రజనీ. మరో వైపు 60 ఏళ్ల కమల్ హాసన్ కూడా హాట్ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ....లిప్ లాక్ సన్నివేశాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇపుడు చిరంజీవి అంశం చర్చకు వస్తోంది.

Mega Fans opinion on Chiranjeevi 150 th movie

చిరంజీవి 150వ సినిమా చేస్తానని ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలసిందే. హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేస్తే.....యాంటీ ఫ్యాన్స్ నుండి విమర్శలు వస్తాయనే కారణంగా ఏదైనా సందేశాత్మక సినిమా కోసం ఎదురు చూస్తోంది మెగా వర్గం. అయితే మెగా అభిమానులు మాత్రం కేవలం సందేశాత్మక సినిమా మాత్రమే కాదు....రొమాన్స్‌తో కూడిన కమర్షియల్ అంశాలు కూడా కావాలని కోరుకుంటున్నారు.

63 ఏళ్ల వయసులో రజనీకాంత్, 60 ఏళ్ల వయసులో కమల్ హాసన్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నపుడు......58 ఏళ్ల వయసున్న చిరంజీవి రొమాన్స్ చేస్తే తప్పు లేదని, సినిమాను సినిమాలానే చూడాలే తప్ప....ఎవరో విమర్శిస్తారని అభిమానులను ఎంటర్టెన్ చేసే అంశాలకు దూరంగా ఉండొద్దని అభిప్రాయ పడుతున్నారు.

ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న చిరంజీవి తన 150 సినిమా గురించి ఆలోచించే అకాశం ఇప్పుడైతే లేదు కానీ.... ఎన్నికలైన తర్వాత 150 సినిమా విషయమై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. చూద్దాం...అప్పుడైనా అభిమానులు కోరుకుంటున్న రొమాంటిక్ అంశాలపై చిరంజీవి దృష్టి పెడతారో? లేదో?

English summary
Mega Fans Opinion is that, When Rajani and Kamal are happily doing films and are not ashamed of romancing young girls, why should Chiranjeevi think about playing the lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu