»   » ‘అత్తారింటికి దారేది’ పాసుల కోసం ఫ్యాన్స్ ధర్నా

‘అత్తారింటికి దారేది’ పాసుల కోసం ఫ్యాన్స్ ధర్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో వేడుక రేపు(జులై 19)న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో నగర పోలీసులు నిర్వహకులు అడ్డదిడ్డంగా, పిరిమితికి మించి పాసులు జారీ చేయకుండా.....ఆడిటోరియం కెపాసిటీ మేరకు మాత్రమే పాసులు జారీ చేసేలా ఆంక్షలు విధించారు.

ఈ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఉన్న పాసులను దక్కించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు పోటీ పడ్డారు. అయితే పాసులు దొరకని అభిమానులు గురువారం హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎదట ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మెగా కుటుంబంపై అభిమానంతో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నామని, రక్తదానాలు చేసామని, అలాంటి తమకే పాసులు ఇవ్వకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పాసులు వివిధ అభిమాన సంఘాలకు డిస్ట్రిబ్యూట్ కావడంతో నిర్వాహకులు కూడా చేతులెత్తేస్తున్నారు.

ఆగస్టు 7న సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Mega fans staged a dharna at Chiranjeevi blood bank demanding passes for Pawan's much hyped upcoming flick 'Attarintiki Daredi'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X