»   » విషం నింపుతున్నారు... చిరు, పవన్‌ను చూసి నేర్చుకోండి (సోషల్ మీడియాలో రచ్చ)

విషం నింపుతున్నారు... చిరు, పవన్‌ను చూసి నేర్చుకోండి (సోషల్ మీడియాలో రచ్చ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ గురించి, మెగా అభిమానుల గురించి సోషల్ మీడియాలో సర్య్కూలేట్ అవుతున్న కర పత్రం ఫ్యాన్స్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. కలిసి కట్టుగా, బలంగా ఒకే కుటుంబంలా ఉన్న మెగా ఫ్యామిలీ, మెగా అభిమానుల మధ్య కొందరు చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని, అభిమానుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారని. ఈ విషయాన్ని అభిమానులు గ్రహించాలని ప్రచారం జరుగుతోంది. 

ఒకప్పుడు శక్తివంతమైన, సుసంపన్నమైన భారతదేశాన్ని చూసి కన్ను కుట్టిన విదేశీయులు దాన్ని జయించి, పాలించాలని ప్రయత్నాలు చేసారు. కలిసి కట్టుగా ఉన్న భారత దేశాన్ని ఓడించం వారి వల్ల కాలేదు. దీంతో కుయుక్తులు ప్రదర్శించారు. వ్యాపారం పేరుతో దేశంలో ప్రవేశించి, భారత రాజ్యాల మధ్య వైరం పెంచి, అంతర్గత యుద్ధాలు సృష్టించి...రాజ్యాలను విడదీసి దేశాన్ని వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పలితంగా భారతీకులకు వందల సంవత్సరాలు విదేశీయుల చేతిలో బానిసత్వం తప్పలేదు.

ఇపుడు ఇలాంటి పరిస్థితే మెగా అభిమానులు, హీరోలు ఎదుర్కొంటున్నారు. సినీ రంగంలో మెగా హీరోలు, అభిమానులు అత్యంత శక్తి వంతంగా ఉన్నారు. నేత్రదానం, రక్తదానం వంటి విశిష్ట కార్యక్రమాలు, గట్టి ఇజంతో సేవా కార్యక్రమాలు చేసి అభిమాని అనే పదం యొక్క విలువ పెంచి, అంతులేని శక్తిగా మారిన మెగా అభిమానులను చూసి కన్నుకుట్టిన కొందరు, నిదానంగా నిర్మలమైన అభిమానుల మనసుల్లో విషాన్ని నింపడం మొదలు పెట్టారని ప్రచారం జరుగుతోంది.

యంగ్ మెగా హీరోలపై కూడా సెటైర్లు వేసారు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

తెగులు పట్టకుండా చూసుకో

తెగులు పట్టకుండా చూసుకో

అటు ఇటు తిరిగి ఒకే కుటుంబం వంటి మెగా అభిమానుల్లో వారిలో వారికే విద్వేషాలు వచ్చేట్లు చేస్తున్నారు. మెగా అభిమానులు ఈ విషయాన్ని గమనించాలి. ఇది నీ కుటుంబం, పచ్చని పంట, దానికి తెగులు పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే... అంటూ సోషల్ మీడియాలో ఓ కరపత్రం హల్ చల్ చేస్తోంది.

పెద్దన్నలు వంటి యువ మెగాహీరోలు

పెద్దన్నలు వంటి యువ మెగాహీరోలు

మీరు కూడా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆ నిమిషం అనిపించిన ఫీలింగ్స్ కి, ఎవరో చెబితే వచ్చిన ఫీలింగ్స్ ని, అభిమానులపై చూపకండి... అంటూ కరపత్రంలో వేడుకున్నారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్

చిరంజీవి, పవన్ కళ్యాణ్

సహనానికి మారు పేరుగా ఉన్న చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి మెగా యువ హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ... సూచించారు.

 కలహించే వాడు కాదు... కలిసుండే వాడే

కలహించే వాడు కాదు... కలిసుండే వాడే

కలహించే వాడు కాదు. కలిసుండే వాడే అభిమాని అంటూ చివర్లో పేర్కొనడం గమనార్హం.

ఎవరి గురించి...

ఎవరి గురించి...

రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి మెగా యువ హీరోలను ఉద్దేశించే ఈ కరపత్రం రిలీజ్ చేసినట్లు స్పష్టమవుతోంది.

English summary
Mega Star Chiranjeevi fans statement viral on social media.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu