బాలయ్య ఫ్యాన్స్‌కు మెగా ఫ్యాన్స్ థాంక్స్
నెల్లూరు: మెగాస్టార్ అభిమానులు, బాలకృష్ణ అభిమానుల మధ్య తరచూ ఏదో ఒక వివాదం చెలరేగడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నందమూరి, మెగా హీరోల సినిమాల రిలీజుల సమయాల్లో కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా జరిగాయి. ఆ మధ్య కలెక్షన్ల విషయంలో ఇరు వర్గాల అభిమానులు ప్లెక్సీల వార్‌కు దిగిన విషయం విధితమే.
అయితే... తాజాగా నెల్లూరులో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మోగా అభిమానులు బాలకృష్ణ అభిమానులకు థాంక్స్ చెప్పారు. ఆశ్యర్యానికి గురిచేస్తున్న ఈ రేర్ సంఘటన వివరాల్లోకి వెళితే..... ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం చేసిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో కొన్ని వేల యూనిట్ల బ్లడ్‌ను డొనేట్ చేసారు మెగా ఫ్యాన్స్.
కాని బ్లడ్ బ్యాంక్ ఉద్యోగులు కొందరు అభిమానుల రక్తాన్ని డబ్బులకు ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకోవడానికి ప్రయత్నించడంతో బాలయ్య అభిమానులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు బాలయ్య అభిమానులకు థాంక్స్ చెప్పినట్లు సమాచారం.
ఏది ఏమైనా ఇలా ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఇలా కలిసి పోవడంపై ఇటు సినీ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. భవిష్యత్‌లో కూడా ఇరు వర్గాల అభిమానులు కలిసి ఉండాలని, ఏ హీరో సినిమా విడుదలైనా ఆదరించాలని, సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











