వైజాగ్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ డోనర్స్ క్లబ్ మెంబర్స్ ఈ రోజు (సోమవారం)జీవితా,రాజశేఖకర్ లపై కేసు వేస్తున్నారు. రాష్ట్రంలోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్స్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు తమ ఫీలింగ్స్ ని హర్ట్ చేసాయని అందుకే తాము సివిల్,క్రిమినల్,పరువు నష్టం దావా వేయటానికి రెడీ అవుతున్నామంటున్నారు.అలాగే జీవిత తాము సేకరిస్తున్న రక్తాన్ని అమ్ముకుంటున్నామంటూ నిరాధార ఆరోపణలు చేయటాన్ని సహించమంటున్నారు.లక్షల్లో ఉన్న తమ మెగా ప్యాన్స్ చూస్తూ ఊరుకోదని వెంటనే అందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అలాగే తమ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం తీసుకుని లబ్ది పొందిన వారి పేర్లతో శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. అంతేగాక నిజంగా మేం రక్తంతో బిజెనెస్ చేస్తే ప్రభుత్వం ఎందుకు బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు ఇచ్చిందని నిలదీసారు.