మెగాస్టార్ చిరంజీవి మృతి అంటూ శోభా డే వివాదాస్పద ట్వీట్.. ఆటాడుకొంటున్న మెగా ఫ్యాన్స్

ప్రముఖ రచయిత్రి శోభాడే సోషల్ మీడియాలో పెట్టిన తప్పుడు పోస్టుకు మెగా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. కనీసం ఎవరు చనిపోయారో తెలియకుండా ఎవరి ఫోటోను పెడితే వారి ఫోటోను పెట్టి ట్వీట్ చేస్తావా అంటూ చిరంజీవి ఫ్యాన్స్ గరం అవుతున్నారు. తమ హీరోపై తప్పుడు ఫోటో పెట్టినందుకు గాను ట్విట్లతో ట్రోలింగ్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ఇంతకు శోభాడే చేసిన తప్పేమిటంటే..

కన్నడ నటుడు చిరంజీవి సర్జా మృతి

కన్నడ నటుడు చిరంజీవి సర్జా మృతి

జూన్ 7వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రముఖ నటుడు, యాక్షన్ కింగ్ మేనల్లుడు చిరంజీవి సర్జా గుండెపోటుకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్ తరలించి చికిత్స అందించే క్రమంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం అభిమానులకు, సినీ ప్రముఖులకు, కన్నడ ప్రేక్షకులకు తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.

మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టి శ్రద్దాంజలి

మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టి శ్రద్దాంజలి

కన్నడ నటుడు చిరంజీవి సర్జా మృతి నేపథ్యంలో రచయిత్రి శోభాడే సోషల్ మీడియాలో శ్రద్దాంజలి ఘటించాలని ప్రయత్నించారు. అయితే చిరంజీవి సర్జా ఫోటోకు బదులుగా మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టి ట్వీట్ చేశారు. మరో యువ నటుడు ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. ఈ విషాద కరమైన వార్త షాక్ గురించి చేసింది. ఆయన మరణం పూడ్చలేనింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం అంటూ పోస్టు చేశారు.

మద్యం తాగి ట్వీట్లు చేయకు

మద్యం తాగి ట్వీట్లు చేయకు

శోభాడే చేసిన తప్పుకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహం చెందారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. అరే శోభా మేడమ్. రెండు పెగ్గులు మద్యం తాగి ట్విట్లు చేయవద్దని చెబుతాం. మెగాస్టార్ చిరంజీవి బతికే ఉన్నారు. చాలా హుషారుగా ఉండే మంచి వ్యక్తిని ఎందుకు చంపేస్తావు అంటూ ట్రోల్ చేశారు.

నీకంటే అజ్ఞాని ఎవరు ఉండరు

నీకంటే అజ్ఞాని ఎవరు ఉండరు

చిరంజీవి సర్జాకు బదులు చిరంజీవి చనిపోయారంటూ ఫోటో పెట్టిన శోభాడే ఎంత అజ్ఞాని అర్ధమైంది. ఆమె కంటే అజ్ఞాని ఎవరూ ఉండరమో అంటూ మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆమెను Dumb, Dumber, Dumbest కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. రకరకాల మీమ్స్‌తో హడలెత్తిస్తున్నారు.

ఎంత మద్యం తాగి ట్వీట్ చేశావు

ఎంత మద్యం తాగి ట్వీట్ చేశావు

శోభాడే పోస్టుపై మరో మెగా అభిమాని స్పందిస్తూ.. మద్యం సేవించడం తప్పుకాదు. కానీ ఈ మోతాదులో తాగడమే తప్పు అని నా ఉద్దేశం. చిరంజీవి సర్జాకు బదులు చిరంజీవి ఫోటో పెట్టడం దారుణం అంటూ మెగా ఫ్యాన్ మండిపడ్డారు.

మేధావులు ఇలానే ఫేక్ న్యూస్

మేధావులు ఇలానే ఫేక్ న్యూస్

శోభాడే తప్పుడు ట్వీట్‌పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. మేధావులు అనుకొనే వాళ్లు వాస్తవాలు తెలుసుకోకుండా ఇలానే ఫేక్ న్యూస్ రాస్తారు. కన్నడ స్టార్ చిరంజీవి సర్జా మరణించారు. కానీ శోభాడే మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టి షేర్ చేశారు అంటూ ట్వీట్ చేశారు.

ఫ్యూచర్ కూడా చెప్పేస్తున్నావా?

ఫ్యూచర్ కూడా చెప్పేస్తున్నావా?

రచయిత్రి శోభాడేపై ట్వీట్‌పై మరో నెటిజన్ వ్యంగ్యంగా స్పందిస్తూ.. మీ ఆరోగ్యం బాగుందా? ఈ రోజుల్లో నీవు ఏం తాగుతున్నావు? ప్రస్తుతం నీవు ప్యూచర్‌ను కూడా ఊహిస్తున్నావు అంటూ తనదైన శైలిలో స్పందించారు.

సగౌరవంగా సన్మానించాలి

సగౌరవంగా సన్మానించాలి

శోభాడే అతి తెలివిపై నెటిజన్ ట్రోల్ చేస్తూ.. ఇలాంటి ట్వీట్ చేసిన గొప్ప రచయిత్రిని ఊరికే వదిలేయొద్దు. ఆమెను సగౌరవంగా సన్మానించాలి. ఈమెను పర్సన్ ఆఫ్ దిస్ టెర్రిబుల్ ఇయర్‌గా నామినేట్ చేయాలి అంటూ ఓ చిరంజీవి అభిమాని ఫైర్ అయ్యారు.

 నీవు స్టుపిడ్ మాత్రమే కావు..

నీవు స్టుపిడ్ మాత్రమే కావు..

చిరంజీవి మరణించారంటూ శోభాడే చేసిన ట్విట్ వివాదంగా మారడంతో నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు నీవు స్టుపిడ్ అనుకొన్నాను. అందుకు సారీ చెబుతున్నాను. కానీ నీవు స్టుపిడిటికి అత్యంత ప్రమాణికంగా నిలిచావు అని నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended Video

Kannada Actor Chiranjeevi Sarja గుండెపోటుతో మృతి
శోభాడే తన ట్వీట్‌ను డిలీట్

శోభాడే తన ట్వీట్‌ను డిలీట్

అయితే చనిపోయింది చిరంజీవి కాదు.. కన్నడ నటుడు చిరంజీవి సర్జా తెలుసుకొన్న రచయిత్రి శోభాడే తన తప్పును సరిద్దిద్దుకొన్నారు. అయితే అప్పటికే ఆమె ట్వీట్ వైరల్ కావడం, మెగా అభిమానులు రచ్చ మొదలు కావడంతో శోభాడే తన ట్వీట్‌ను డిలీట్ చేసింది. అయినా సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X