అప్పుడలా.. ఇప్పడిలా.. అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ ట్రోల్స్

Mega vs Allu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప2 మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా నిలిచింది. ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. కానీ, ఈ విడుదలకు ముందు మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. పుష్ప 2 సినిమా విడుదలకు ముందు పాత వీడియోలను చేస్తూ.. మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున బన్నీపై ట్రోల్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ తన కెరీర్ ప్రారంభంలో ఏ స్టేజ్ ఎక్కిన మెగా స్టార్ చిరంజీవి, మెగా హీరోస్, మెగా ఫ్యాన్స్ మాటలే ఎక్కువ వినిపించేవి. తాను కూడా మొదట మెగా హీరోనేనని చెప్పుకునేవాడు. తన సినిమాలకు మెగా ఫ్యాన్స్ ఇస్తున్న సపోర్ట్ గురించి కూడా పలు ఈవెంట్లలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ మెగా నామస్మరణను మరిచి చాలా రోజులు అవుతుంది. మెగా ఫ్యాన్స్ ను పట్టించుకోవడం కూడా మానేశాడు. అల్లు ఆర్మీ అంటూ తనకు తానే చెప్పుకోవడం ప్రారంభించాడు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటే దేవుడు, దైవం అన్నట్లుగా చెప్పేవాడు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది.

Mega fans trolls on Allu arjun prefers allu aravind more than chiranjeevi before Pushpa 2 release

అల్లు అర్జున్.. వరుస హిట్స్ అందుకోవడం, బన్నీ తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. పుష్ప 1 సినిమాతో నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ హీరోస్ కూడా చేయని పాట్నాలో తన కొత్త సినిమా పుష్ప టు ఈవెంట్ పెట్టి తన స్టామినా ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేశాడు.ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. ఏ హీరో అయినా సక్సెస్ కావాలని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకుంటారు అది సహజమే. కానీ తన సక్సెస్ కు పునాది రాళ్లుగా నిలిచిన మెగా కుటుంబం, మెగా ఫ్యాన్స్ ను కాస్ట్ దూరం పెట్టినట్లు అనిపించడంతో.. మెగా ఫాన్స్ అన్యతగా భావిస్తున్నారు.

అల్లు అర్జున్ మాట మార్చాలంటూ కెరీర్ ప్రారంభంలో ఒక లాగా.. స్టార్ గా ఎదిగిన తర్వాత మరోలాగా మాట్లాడుతున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గంగోత్రి నుండి సరైనోడు సినిమా వరకు మెగా జపం చేసిన అల్లు అర్జున్.. వరుస హిట్స్ అందుకోవడం, పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్స్ సంపాదించుకోవడం తో బన్నీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగా కాంపౌండ్ నుండి బయటపడి తనకంటూ ప్రత్యేకంగా బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పలు సందర్భాల్లో అర్థమవుతుంది. ఈ తరుణంలోనే మెగా ఫ్యాన్స్ కాకుండా బన్నీ ఆర్మీ, అల్లు అర్జున్ ఆర్మీ అనే పేర్లు తెరమీదకి వచ్చాయి.

ఇలాంటి పరిణామాలతో బన్నీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ పాత వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా.. గతంలో మంచు లక్ష్మి ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తనకు దేవుడు, దైవం అంటూ చెప్పుకొచ్చిన వీడియోస్ ను .. ఇటీవల నందమూరి బాలకృష్ణ టాక్ షోలో.. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అల్లు అరవింద్ నా తండ్రి .. ఈ ప్రపంచంలోనే అత్యంత ఇష్టమైన వ్యక్తి అతనే, ఆయనను ఎంతగానో ప్రేమిస్తాను అంటూ చెప్పడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలను జతచేసి.. వీడియోలు మీన్స్ ను క్రియేట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ మీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ మాట మార్చాడు అంటూ మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి మెగా ఫ్యాన్స్ నామస్మరణ చేసినా.. అల్లు అర్జున్ ..ఇప్పుడు మా పూర్తిగా మారిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. దిగాక బోడ మల్లన్న అన్నట్లు వ్యవహరిస్తున్నారని మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇప్పటికైనా అల్లు అర్జున్ ..మెగా ఫ్యాన్స్ గురించి గానీ, మెగా ఫ్యామిలీ గురించి గానీ, పాజిటివ్ గా మాట్లాడితే ఫ్యాన్ వార్ ముగిసిపోతుందంటూ పలువురు అభిప్రాయం పడుతున్నారు. ఈ ఫ్యాన్ వార్ ఇలానే కొనసాగితే.. పుష్ప 2 సినిమా కలెక్షన్లపై ఆ తర్వాత గేమ్ చేంజర్ వసూళ్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందంటూ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫ్యాన్ వార్ సమసిపోతే బాగుంటుందంటూ పలువురు భావిస్తున్నారు. మెగా వెర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ కు ఎప్పుడు తెరబడుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X