చిరు ఫ్యామిలీలో మెగా సంబరాలు.. కొడుకుతో పవన్ కళ్యాణ్ భార్య వచ్చి.. వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి ఇంట సందడి వాతావరణం నెలకొంది. ఈ సందడికి కారణం చిరంజీవి మనవరాలు. అదేనండీ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ- కళ్యాణ్ దేవ్ గారాల పట్టి నవిష్క. ఇటీవలే ఈ చిన్నారి అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగింది? ఎవరెవరు హాజరయ్యారు? వివరాల్లోకి పోతే..

శ్రీజ- కళ్యాణ్ దేవ్ కూతురు నవిష్క
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. కళ్యాణ్ దేవ్‌తో వివాహం తర్వాత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ జంట అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా కొన్ని నెలల క్రితం పాప జన్మించిన సంగతి తెలిసిందే. తమ ముద్దుల కూతురికి నవిష్క అనే పేరు పెట్టుకున్నారు ఈ దంపతులు.

చిరు ఫ్యామిలీలో మెగా పండుగ
శ్రీజ కూతురు నవిష్క అన్నప్రాసన రూపంలో చిరు ఫ్యామిలీలో మెగా సంబరాలు జరిగాయి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్క చోట చేరి నవిష్క అన్నప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించారు. నిజానికి ఈ వేడుక జూన్ 19 వ తేదీన జరిగినప్పటీకీ దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

కొడుకుతో సహా పవన్ కళ్యాణ్ భార్య
ఈ వీడియోలో చిరు ఫ్యామిలీ అంతా ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. ఇల్లంతా అందంగా ముస్తాబు చేసి కొత్త అందం తీసుకొచ్చారు. వేడుకలో చిరంజీవి దంపతులు సందడి సందడిగా కనిపించగా.. కొడుకుతో సహా పవన్ కళ్యాణ్ భార్య హాజరు కావడం స్పెషల్ అట్రాక్షన్ అయింది.
రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఉపాసన
నవిష్క అన్నప్రాసన వేడుకలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సహా చరణ్ వైఫ్ ఉపాసన కూడా హాజరు కాలేదు. వ్యక్తిగత పనుల నిమిత్తం వీరు హాజరు కాలేక పోయారని తెలిసింది. ఈ ముగ్గురు తప్ప మిగిలిన మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుకలో తెగ సందడి చేశారు. ఈ వీడియో చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు.

చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్
శ్రీజను పెళ్లాడిన తర్వాత కొన్ని రోజులకే కళ్యాణ్ దేవ్ నటన వైపు అడుగులు వేశారు. మెగా ఫ్యామిలీ వారసత్వంతో 'విజేత' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. తొలి సినిమాతో ఫర్వాలేదనిపించి ఈ మెగా ఫ్యామిలీ అల్లుడు సెలక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.


Click it and Unblock the Notifications











