వైజాగ్ లో చిరంజీవి ఫిల్మ్ స్టూడియో

By Srikanya

త్వరలో చిరంజీవి వైజాగ్ లో ఓ స్టూడియో కట్టనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రస్తుతం కాంగ్రేస్ లో కొనసాగుతున్న చిరంజీవికి వారు స్టూడియో కట్టుకోవటానికి అవకాశం ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అందులోనూ చిరంజీవి చాలా కాలంగా సొంతంగా స్టూడియో నిర్మించాలని ఆలోచనలో ఉన్నారు. ఈ స్టూడియోకి మెగా ఫిల్మ్ స్టూడియో అనే పేరు పెట్టనున్నారని తెలుస్తోంది. అందులోనూ తమ కుటుంబం నుంచి తను మాత్రమే కాక రామ్ చరణ్,అల్లు అర్జున్ కూడా హీరోలు కావటం,త్వరలో అల్లు శిరీష్ కూడా హీరో కావటంతో ఓ స్టూడియో ఉంటే మంచిదని భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పటికే నాగార్జునకి అన్నపూర్ణ స్టూడియో, వెంకటేష్ కి రామానాయుడు స్టూడియో, మహేష్ బాబుకి పద్మాలయా స్టూడియో, ఎన్టీఆర్ ఫ్యామిలీకి రామకృష్ణ స్టూడియో ఉండటంతో మెగా ప్యామిలీ కూడా తమకో స్టూడియో కావాలనే ఈ ప్రపోజల్ ను ముందుకు తీసుకు వెళ్తున్నారు.

ఇక వైజాగ్ లో ఇప్పటికే రామానాయుడు ఓ స్టూడియో కట్టి ఉన్నారు. అక్కడ కూడా సినీ పరిశ్రమ భవిష్యత్ లో అభివృధ్ది చెందుతుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి అక్కడ స్టూడియో నిర్మించాలనే ఆలోచన చాలా చక్కనదని అంతా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్టూడియో కోసం సరపడ ల్యాండ్ ని వెతుకుతున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం పూర్తైన వెంటనే వివాహం ఉంటుంది. ఇవి అయిన తర్వాత చిరంజీవి పూర్తి కాన్సర్టేషన్ తో ఈ స్టూడియో పనుల్లో ఉంటారని వినికిడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X