మెగా హీరో చెయ్యబోతున్న మలయాళ సినిమా, గ్యాప్ తరువాత మళ్ళి సినిమా!
హీరో అల్లు శిరీష్ చివరగా చేసిన చిత్రం 'ఒక్క క్షణం' పరువాలేదు అనిపించుకున్న ఈ సినిమా తర్వాతఈ హీరో చెయ్యబోయే సినిమాకు సంభందించి రకరకాల వార్తలు బయటికి రావడం జరిగింది. చివరికి మలయాళ సినిమాని రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడు ఈ మెగా హీరో.
మలయాళంలో దుల్గర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన 'ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ)' సినిమాను తెలుగులో అల్లు శిరీష్ రీమేక్ చెయ్యబోతున్నాడు. ఈ సినిమాను మధురా శ్రీధర్ నిర్మాణంలో సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించనున్నారు. ఒక ఇంగ్లిష్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అల్లు శిరీష్ ఈ విషయాన్నీ వెల్లడించాడు.

2013లో రిలీజ్ అయిన ఈ సినిమా మలయాళంలో సంచలన విజయం సాధించటంతో పాటు దుల్కర్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. అల్లు శిరీష్ కు ఈ కథ సెట్ అవుతుందని భావించి చెయ్యబోతున్నారు. ఈ సినిమాకు సంభందింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











