ఎన్టీఆర్ ఫొటోతో నందమూరి అభిమానులను ఆకట్టుకున్న మెగా హీరో!

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డేకు ఇంకా 10రోజులు సమయం ఉన్నప్పటికీ అప్పుడే అభిమానుల్లో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కామన్ డీపీలతో తారక్ బర్త్ డేను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. అభిమానులే కాకుండా సినీ తారలు కూడా జూనియర్ ఎన్టీఆర్ పై వారికున్న అనుబంధాన్ని గురించి చెబుతూ తారక్ స్పెషల్ ఫోటోని షేర్ చేస్తున్నారు.

ఇప్పటికే కాజల్ అగర్వాల్, థమన్, దేవి శ్రీ ప్రసాద్ వంటి స్టార్ యాక్టర్స్, టెక్నీషియన్స్ తారక్ బర్త్ డే డీపీని షేర్ చేశారు. ఇక ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తారక్ తో ఉన్న అనుబంధం గురించి వివరించాడు. "గత 12 ఏళ్ల నుంచి అతనితో పటిష్టమైన స్నేహాన్ని ఏర్పరచుకున్నాను.

Mega hero Sai dharam tej about jr ntr birthday CDP

నా వరకు అతను సాధారణంగా ఉండే మానవత్వం కలిగిన వ్యక్తి. కానీ చాలా మందికి అతను హీరో కంటే ఎక్కువ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే" అంటూ సాయి ధరమ్ తేజ్ పాజిటివ్ గా తారక్ తో తనకున్న అనుబంధం గురించి పేర్కొన్నాడు.

అలాగే అభిమానుల కోసం కామన్ డీపీని లాంచ్ చేసి నందమూరి అభిమానుల మనసుల్ని కూడా గెలుచుకున్నారు ఈ మెగా హీరో. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో సిద్ధమవుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా విడుదల తేదీని వాయిదా వేసుకున్న ఆ సినిమా సమ్మర్ ఎండింగ్ లో పరిస్థితులను బట్టి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. చివరగా సాయి మారుతి దర్శకత్వంలో 'ప్రతి రోజు పండగే అనే సినిమా చేసి హిట్టు కొట్టిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X