ఎన్టీఆర్ మానియాపై మెగా హీరో కామెంట్.. దాని ఫలితమే అరవింద సమేత రిజల్ట్!
Recommended Video

అరవింద సమేత చిత్రానికి ప్రముఖుల నుంచి ప్రశంసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అరవింద సమేత చిత్ర విజయంపై దర్శక ధీరుడు రాజమౌళి చిత్ర యూనిట్ ని అభినందించారు. నితిన్ ప్రశంసలు కురిపించాడు. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ అరవింద సమేత విజయం పట్ల తన స్పందన తెలియజేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఇప్పటివరకు చిత్రాలు తీశారు. అరవింద సమేత చిత్రంతో తొలిసారి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కథని ఎంచుకోవడంతో ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంచనాలకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ తన నటనతో అదరగొట్టగా, త్రివిక్రమ్ తన దర్శకత్వ ప్రతిభని మరో మారు నిరూపించుకున్నారు.

కొనసాగుతున్న ప్రభంజనం
అరవింద సమేత చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ ప్రారంభం కావడంతో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ నటనతో , త్రివిక్రమ్ దర్శత్వం, డైలాగ్స్ తో అదరగొట్టారు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం చిత్రాన్ని మరో స్థాయికి చేర్చాయి.
ఎన్టీఆర్ డెడికేషన్‌కు నిదర్శనం
మెగా హీరో సాయిధరమ్ తేజ్ అరవింద సమేత చిత్రంపై ట్వీట్ చేశాడు. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటీనటుల డెడికేషన్ కు అరవింద సమేత చిత్రం నిదర్శనం అని తెలిపాడు.

దర్శకుడి ప్రతిభ
దర్శకుడు త్రివిక్రమ్ అత్యుత్తమ ప్రతిభ మరోమారు ఏ చిత్రంతో బయటపడింది. నిర్మాతల కమిట్మెంట్ కు అరవింద సమేత చిత్రం ప్రతిరూపంగా నిలిచిందని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.

ఆ ముగ్గురూ
ఎన్టీఆర్ ని ఇలాంటి పాత్రలో చూడడం చాలా సంతోషంగా ఉంది. జగపతి బాబు ఎలాంటి పాత్ర అయినా అదరగొడుతారు. అరవిందగా పూజా హెగ్డే మంచి నటన కనబరిచిందని తేజు తెలిపాడు. ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్ త్వరలో కిషోర్ తిరుమల దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











