లాక్‌డౌన్‌లో ఆ విషయాన్ని లైట్ తీసుకొని ఇబ్బందుల్లో పడ్డ వరుణ్ తేజ్
టాలీవుడ్ మెగా హీరోలు మొత్తానికి సక్సెస్ ట్రాక్ లోనే వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్నారు. జయాపజయాలను లెక్క చేయకుండా మార్కెట్ పెంచుకుంటూ వెళుతున్న వారిలో వరుణ్ తేజ్ ఒకరు. ఈ యువ హీరో బాడీ లెంజ్వెజ్ కి ఎలాంటి కథ అయిన సెట్టవుతుందని చెప్పవచ్చు. ఒకవైపు లవ్ స్టోరీలు మరోవైపు కామెడీ కథలు అలాగే మాస్ యాంగిల్ కూడా చూపిస్తున్నాడు.
కంచె, ఫిదా, F2, గద్దల కొండ గణేష్ వంటి సినిమాల లైనప్ చుస్టునే ఈజీగా అర్ధమవుతోంది వరుణ్ తేజ్ టాలెంట్ ఏమిటో. ఇక నెక్స్ట్ అంతకు మించి అనేలా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక కథను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఊపందుకునే సమయంలోనే లాక్ డౌన్ దెబ్బ పడింది. అయితే ఆ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడి కండలు పెంచాడు. అయితే షూటింగ్స్ ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదని లైట్ తీసుకోవడంతో ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు.

వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలని ఒక వైపు చిత్ర యూనిట్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న తరుణంలో వరుణ్ మునుపటి కంటే ఎక్కువ బరువు పెరిగాడు. వరుణ్ తేజ్ బాడీతో చాలా సార్లు ఇబ్బంది పడ్డాడు. అతను రెస్ట్ తీసుకుంటే వెంటనే లావెక్కిపోతాడాని ఒక టాక్ ఉంది.
ఇక చెల్లి ఎంగేజ్మెంట్ అప్పుడే వరుణ్ లావయ్యాడాని తెలిసిపోయింది. ఇక ఇప్పుడు చేసేదేమీ లేక హెవీ వర్కౌట్ స్టార్ట్ చేశాడు. రెండు నెలల్లోగా వీలైనంత వరకు అనుకున్న షేప్ లోకి బాడీని రప్పించాలని ప్లాన్ చేసుకున్నాడు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











