బీచ్ లో బాగా రిలాక్స్ అవుతున్న మెగా హీరో(ఫోటో)

By Srikanya

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి మరో కుర్రాడు వరుణ్ తేజ(నాగబాబు కుమారుడు)దూసుకువస్తున్న సంగతి తెలిసిందే. గొల్లభామ (వర్కింగ్ టైటిల్ )తో రూపొందుతున్న ఈ చిత్రం సౌత్ ఇండియాలోని వేర్వేరు లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో వరుణ్ తేజ కన్యాకుమారికి వెళ్లి అక్కడ బీచ్ లో రిలాక్స్ అయ్యారు. అదే మీరు చూస్తున్న ఫోటో.

వరుణ్ తేజ మాట్లాడుతూ... " ఈ రోజు షూటింగ్ నుంచి బ్రేక్ దొరికింది... ఇప్పుడే కన్యాకుమారి చేరుకున్నాను...చాలా అద్బుతంగా ఉందీ వ్యూ.. !" అంటూ ఈ ఫోటో ని పోస్ట్ చేసి అన్నారు. భుజాన ఓ ల్యాప్ టాప్, స్పోర్టింగ్ బాక్సర్స్ తో ఉన్న వరుణ్ చాలా కామ్ గా కూల్ గా ఉంటాడని అంటారు.

ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24 నుంచి జరగనుంది. కేరళలోని కొచ్చి లో కొన్ని ప్రాతాల్లో ఈ షూట్ చేస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హేగ్డే చేస్తోంది. సినిమాకి 'గొల్లభామ' అనే పేరుని పరిశీలిస్తున్నారు. చిత్రంలో బ్రహ్మానందం,ప్రకాష్ రాజ్, నాజర్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Mega Hero Varun tej relaxing at Beach!!

లియో ప్రొడక్షన్స్‌ పతాకంపై సినిమా రూపొందబోతోంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం అందిస్తున్న దీనికి ఠాగూర్‌ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు. గోదావరి అందాల నడుమ సాగే చక్కటి ప్రేమకథగా సినిమా ఉండబోతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. 'కొత్తబంగారులోకం',' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనదైన ముద్ర తెలుగు తెరపై వేసి ఆకట్టుకొన్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో తొలి అడుగులు వేయించేందుకు సిద్ధమవుతున్నాడు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి.

చిరంజీవి మాట్లాడుతూ... నాగబాబు కొడుకంటే నా కొడుకు అన్నట్లే అని, వరుణ్ తేజను అభిమానులు ఆశీర్వదించాలని చిరంజీవి కోరారు.నాగబాబు కొడుకు వరుణ్ తేజను ప్రమోట్ చేయడానికి మెగా హీరోలంతా కలిసి పని చేయనున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు స్వయాన సోదరుడైన నాగబాబు....తన కొడుకు ఎంట్రీ కోసం పర్ ఫెక్టుగా ప్లానింగ్ చేసారు. గతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఎంట్రీ సందర్భంగా ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న అనుభవం నాగబాబుకు ఉంది.

2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. నాగబాబు కొడుకుకి సైతం గోదావరి బ్యాక్ డ్రాప్ ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్‌ హీరోగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన క్వాలిటీస్‌ను మరింత మెరుగు పరుచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో చాలా కష్టడుతున్నాడని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తనతైన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేసాడు. ఆ తర్వాత ఆయన వారసత్వంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ డాన్స్‌ల విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేకత చాటుకోవడానికి ట్రై చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X