మెగా హీరోలు...కృష్ణుడు వెనక పడ్డారు
హైదరాబాద్ : మెగా హీరోలు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ వీళ్లు ముగ్గురూ ఇప్పుడు కృష్ణ నామ జపంలో ఉన్నారు. రామ్ చరణ్ తాజాగా ...కృష్ణవంశీ దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి గోవిందుడు అందరివాడేలే అనే టైటిల్ పెట్టారు. అలాగే పవన్ కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి గోపాల గోపాల అనే టైటిల్ పెట్టారు. మరి వరుణ్ తేజ(నాగబాబు కుమారుడు) చిత్రానికి ఏం టైటిల్ పెట్టారు..దానికి కృష్ణుడుకి సంభంధం ఏమిటనేదే కదా మీ సందేహం.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మొదట 'గొల్లభామ' అనే టైటిల్ పెట్టినట్టు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు దానిని 'ముకుందా' లేదా 'ముకుందా మురారి' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఇంకా ఏమీ ఖరారు కాలేదు. ఈ టైటిల్ కూడా కృష్ణుడుకి చెందిన ది కావటంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది.
వరుణ్ తేజ సరసన పూజ హెడ్గే నటిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కి.జే.మేయర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











