twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇర్ఫాన్ మృతిపై మెగా సంతాపం.. ఆ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.. స్పందించిన చిరు, పవన్

    |

    బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) మృతితో సినీ లోకం నివ్వెరబోయింది. కోలన్ క్యాన్సర్ (పెద్దపేగు సంబంధిత వ్యాధి)తో బాధపడుతున్న ఆయన నేడు మరణించారు. ఆయన మృతిపట్ల సినీ తారలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ టాలీవుడ్ అని తేడ లేకుండా సెలెబ్రిటీలందరూ ఇర్ఫాన్ మృతిపై స్పందిస్తున్నారు. ప్రస్తుతం మెగా హీరోలంతా ఇర్ఫాన్ మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.

    ఎవ్వరూ భర్తీ చేయలేరు..

    ఎవ్వరూ భర్తీ చేయలేరు..

    మెగా స్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ‘ఇర్ఫాన్ ఖాన్ చనిపోయాడనే భయంకరమైన వార్త విని ఎంతో కుమిలిపోయాను. ప్రపంచ ఖ్యాతిగడించిన ఓ గొప్ప నటుడు. ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఆయన వ్యక్తిత్వం, ప్రవర్తన వేసిన ముద్ర మన గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాము.. మీరు ఎప్పటికీ గుర్తుండి పోతార'ని ట్వీట్ చేశాడు.

     షాక్ అయ్యాను..

    షాక్ అయ్యాను..

    మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. ‘ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త తెలియగానే షాక్ అయ్యాను.. ఎంతోబాధ కలిగింది.. ఆయన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మీరు ఇంకా స్ఫూర్తి నింపుతూనే ఉంటారు..మీ ఆత్మకు శాంతి చేకూరాల'ని ట్వీట్ చేశాడు.

    రత్నాన్ని కోల్పోయింది..

    రత్నాన్ని కోల్పోయింది..

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘సినిమా ప్రపంచం ఓ కలికితు రాయిని, ఓ రత్నాన్ని కోల్పోయింది. అరుదైన నటుడు, అలాంటి లెజెండ్‌ను సినీ పరిశ్రమ పోగొట్టుకుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాల'ని ట్వీట్ చేస్తూ ఆ భగవంతున్ని కోరుకున్నాడు.

    Recommended Video

    International Dance Day : Megastar Chiranjeevi Passion Towards Dance
    గొప్ప నటుడే కాదు మంచి మనిషి..

    గొప్ప నటుడే కాదు మంచి మనిషి..

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ‘ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త వినగానే షాక్ అయ్యాను. తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన తెరపై కనిపించే విధానానికి నేనెప్పుడూ ముగ్దుడిని అవుతుంటాను. ఓ గొప్ప నటుడే కాకుండా మంచి మనిషి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాల'ని ట్వీట్ చేశాడు.

    English summary
    Mega Heroes Condolences To Irrfan Khan Demise
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X