మెగా హీరోలవి కబ్జా చేసిన ముగ్గురు డైరెక్టర్లు!
హైదరాబాద్: టాలీవుడ్‌లోని ముగ్గురు టాప్ డైరెక్టర్లు మెగా హీరోలందరినీ గుప్పిట్లో పెట్టుకోవడం పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. నాలుగో వ్యక్తికి చాన్స్ ఇవ్వకుండా ఈ ముగ్గురు మెగా హీరోలను పంచుకుని వరుసపెట్టి సినిమాలు తీస్తుండటం గమనార్హం. ఆ ముగ్గురు ఎవరోకాదు పూరి జగన్నాథ్, వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే అల్లు అర్జున్‌తో మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గతంలో పూరి పవన్‌తో బద్రి, బన్నీతో దేశ ముదురు చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.
మరో డైరెక్టర్ వివి వినాయక్ కూడా సక్సెస్ బాట పట్టేందుకు మెగా హీరోలపై దృష్టి సారించారు. గతంలో బన్నీతో 'బద్రీనాథ్' చిత్రం చేసిన వినాయక్....ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేక పోయారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగా హీరోలతోనే తను ఆశించిన ఫలితాలు వస్తాయని భావిస్తున్న వినయాక్ ఆ వెంటనే రామ్ చరణ్‌తో 'నాయక్' చిత్రానికి ప్లాన్ చేశారు. చిరంజీవి 150వ చిత్రానికి కూడా వినాయకే దర్శకత్వం వహించబోతున్నారు.
ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు బ్రేక్ ఇచ్చిన మూవీ పవర్ స్టార్ నటించిన 'జల్సా'. ఇటీవల బన్నీతో 'జులాయి' సినిమా తీసిన త్రివిక్రమ్ మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











