మేమంత మీ వెంటే.. మెగా హీరోలు.. గమ్యం ఎదురుచూస్తుంది మిత్రమా.. కోన ట్వీట్ల వర్షం
Recommended Video

అజాతవాసి సినిమా తర్వాత రాజకీయ రంగంలో దూకిన పవన్ కల్యాణ్ టాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొన్న పవన్ కల్యాణ్ అక్కడి నుంచే తెలంగాణలో రాజకీయ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. బాబాయ్ చేపట్టిన యాత్రకు మెగా హీరోలు రాంచరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, మాటల రచయిత, నిర్మాత కోన వెంకట్ మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. వారేమన్నారంటే..

చలోరే చలో రే.. రాంచరణ్
నేను భారతీయుడిని. నా మాతృభూమిని సంరక్షించుకొంటాను అంటూ పవన్ కల్యాణ్ చాలా అద్భుతంగా చలో రే చలో రే యాత్రను ప్రారంభించాడు. బాబాయ్.. కార్యసాధనలో అంతా శుభమే జరుగాలి. జై జనసేన అంటే రాంచరణ్ ట్వీట్ చేశారు. రాంచరణ్ ట్వీట్‌ను ఉపాసన రీట్వీట్ చేశారు.

మీ వెంటే మేము.. సాయిధరమ్ తేజ్
పవన్ కల్యాణ్ యాత్రపై సాయిధరమ్ తేజ్ స్పందించాడు. మేనమామ యాత్రపట్ల సానుకూలంగా స్పందించాడు. మీ వెంటే మేము అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

బలంగా ఉంటాం.. వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పవన్ కల్యాణ్ యాత్రకు మద్దతు తెలిపారు. ఆల్ ది బెస్ట్ బాబాయ్.. మేమంత మీకు మరింత నైతిక బలాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అని వరుణ్ ట్వీట్ చేశారు.

నడక మొదలైంది.. కోన వెంకట్
సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఘాటైన వ్యాఖ్యలు సంధిస్తూ పవన్‌కు మద్దతు తెలిపిన కోన వెంకట్ కూడా జన సేనానికి అండగా నిలిచారు. నడక మొదలైంది. గమ్యం ఎదురుచూస్తుంది మిత్రమా అంటూ కోన ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











