2020లో మెగా హీరోలకు భారీ దెబ్బ.. వాయిదా పడిన ముఖ్యమైన సినిమాలు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది విడుదల కావాల్సి సినిమాలు చాలానే మిస్ అయ్యాయి. 20 20 స్పీడ్ కు ఒక్కసారిగా కరోనా బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా ప్లాన్స్ అన్ని చేంజ్ అయ్యాయి. ఇక ఈ ఏడాదిలో విడుదల కావాల్సన సినిమాల్లో మెగా హీరోల సినిమాలు చాలానే ఉన్నాయి. మొదట ఆచార్య సినిమా. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా 2020లో రావాల్సింది. షూటింగ్ సగానికి చేరుకునే లోపే కరోనా రావడంతో వచ్చే ఏడాదికి వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇక మెగా ఫ్యామిలి నుంచి పరిచయం కాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హిట్ కొట్టాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో అనుకోకుండా దెబ్బ పడింది. ఆ సినిమాకు ఓటీటీ ఆఫర్స్ వచ్చినప్పటికీ వైష్ణవ్ తేజ్ కెరీర్ దృష్ట్యా నిర్మాతలు రిస్క్ తీసుకోలేదు. ఇక సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ కూడా ఈ ఏడాది సమ్మర్ లోనే రావాల్సింది. లాక్ డౌన్ వల్ల ఆ సినిమా కూడా వాయిదా పడింది. ఇక ఈ నెల ఏండింగ్ లోనే రిలీజ్ చేస్తారని టాక్ వస్తోంది. కానీ విడుదలయ్యే వరకు నమ్మలేని పరిస్థితి.

ఇక మెగా పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటి. చాలా గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ ఎండ్ అవుతున్న సమయంలో లాక్ డౌన్ మొదలైంది. మే నెలలో సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పటికి కూడా విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వేలేదు. ఇక వరుణ్ తేజ్ బాక్సర్ సినిమా కూడా ఈ ఏడాది ఏండింగ్ లో రావాల్సింది. కానీ ఆ సినిమా షూటింగ్ కొంచెం కూడా పూర్తవ్వలేదు. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా సూపర్ మచ్చి సినిమాతో ఈ ఏడాదిలోనే రావాలని అనుకున్నాడు. ఇక 2020 సంక్రాంతి అనంతరం ఆ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











