»   »  మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక కొత్త బిజినెస్ (వీడియోస్)

మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక కొత్త బిజినెస్ (వీడియోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుండటం మెగా అభిమానులకే కాదు, తెలుగు ప్రేక్షకులందరికీ సర్‌ప్రైజ్ లాంటి విషయమే. నాగ శౌర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నిహారిక లీడ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మధుర శ్రీధర్ నిర్మించబోతున్నారు.

ఈ విషయమై మెగా అభిమానుల సర్కిల్ లో ఆసక్తికర చర్చ ఇంకా సాగుతూనే ఉంది. ఇదిలా ఉండగానే నిహారిక మరో కొత్త బిజినెస్ లోకి దిగింది. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివిన నిహారిక... యాంకర్ గా తన సత్తాచాటడంతో పాటు యూనిక్ ఎక్స్‌పర్మెంటుతో ప్రొడక్షన్ రంగంలోకి దిగుతోంది.

‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో నిహారిక కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. ప్రస్తుతానికి ఇది సినిమాలు నిర్మించేంత పెద్ద ప్రొడక్షన్ సంస్థ కాదు. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ మీద యూట్యూబ్ సిరీస్‌ ప్రారంభించింది నిహారిక. ఇప్పటికే తన క్లోజ్ ఫ్రెండ్ ప్రణీత్ బ్రామందపల్లి దర్శకత్వంలో ‘ముద్దపప్పు ఆవకాయ' పేరుతో యూట్యూబ్ సిరీస్ మొదలెట్టింది.

అమృతం సీరియల్ తరహాలో ‘ముద్ద పప్పు ఆవకాయ' అనేది ఎంటర్టెన్మెంట్ సిరీస్ అని తెలుస్తోంది. ఎపిసోడ్లుగా ఎంటర్టెన్మెంట్ పంచే విధంగా దీన్ని డిజైన్ చేనట్లు తెలుస్తోంది. త్వరలో నిహారిక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనుంది. అయితే ఇందులో అర్జున్, ఆశా అనే రెండు క్యారెక్టర్లు కీలకంగా ఉండనున్నాయని స్పష్టమవుతోంది.

‘ముద్దపప్పు ఆవకాయ'కు.... అందులోని అర్జున్, ఆశా క్యారెక్టర్లకు డిఫరెంటుగా ప్రచారం మొదలు పెట్టారు. సాయి ధరమ్ తేజ్, నాగచైతన్య, నాని, మంచు లక్ష్మి, కాజల్, నిత్యామీనన్, సందీప్ కిషన్, నవదీప్ తదితరులు నిహారిక కోసం వీడియో బైట్స్ ఇచ్చారు. స్లైడ్ షోలో ఆ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.

సాయి ధరమ్ తేజ్


ముద్ద పప్పు ఆవకాయలోని మెయిన్ క్యారెక్టర్లకు ప్రచారం కల్పించడంలో సాయి ధరమ్ తేజ్ సపోర్టుగా నిలిచాడు.

కాజల్ అగర్వాల్


ఆశా ఎవరు? అంటూ కాజల్ అగర్వాల్ ఇలా...

నాగ చైతన్య


అర్జున్ ఎవరు? అంటూ పబ్లిసిటీ కాంపెయిన్లో నాగ చైతన్య.

నాని


అశ దోశ అర్జున్ అంటూ నాని ఇలా...

మంచు లక్ష్మి


ముద్ద పప్పు ఆవకాయ టీంకు ఆల్ ది బెస్ట్ చెబుతున్న మంచు లక్ష్మి.

నిత్యా మీనన్


నిత్యా మీనన్ కూడా ముద్ద పప్పు ఆవకాయ కాంపెయిన్లో పాల్గొంది.

సందీప్ కిషన్


ఈ కాంపెయిన్ లో సందీప్ కిషన్ కూడా జాయిన్ అయ్యారు.

నవదీప్


నాకు అర్జున్ తెలియదు...అల్లు అర్జున్ మాత్రమే తెలుసు అంటూ నవదీప్.

English summary
Niharika, who graduated in Mass Communication and Journalism, not only tried her hand in anchoring, but is also venturing in to production with an unique experiment. The soon to be mega heroine has launched her production house 'Pink Elephant Pictures', in which she will be producing a YouTube web series named Mudhapappu Avakaya, under the direction of her close friend Praneeth Bramandapally.
Please Wait while comments are loading...