మెగా ప్యామిలీ హీరోయిన్స్ తో సెక్స్ కామిడీ
మెగా కౌంపౌడ్ లోంచి వచ్చిన నేహా శర్మ, సారా జేన్ డియాస్ లు ప్రస్తుతం ఓ సెక్స్ కామెడీ చేస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో అవకాశాలు సంపాదించుకోలక మిగిలిపోయిన ఈ ముద్దు గుమ్మలు హిందీలో క్యా సూపర్ కూల్ హై హమ్ అనే చిత్రం చేస్తున్నారు. చిరుత చిత్రంలో రామ్ చరణ్ సరసన నేహా శర్మ పరిచయమైంది. అలాగే సారా జేన్ డియాన్..పవన్ కళ్యాణ్ సరసన పంజా చిత్రంలో చేసింది. అయితే వీళ్లిద్దరూ తెలుగులో ఆ తర్వాత ఆఫర్స్ సంపాదించుకోలేకపోయారు.
నేహాశర్మ తర్వాత కుర్రాడు చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన చేసినా ఆమెకు గుర్తింపు రాలేదు. ఆ సినిమా ఫెయిల్యూర్ కావటంతో ఇక్కడ ఆెకు అవకాశాలు రాలేదు. పంజా పెద్ద డిజాస్టర్ కావటంతో సారాకు సైతం అస్సలు ఎవరికీ గుర్తు లేకుండాపోయింది. ఇక ఈ హిందీ చిత్రం ఓ సెక్స్ కామిడీ. గతంలో వచ్చిన క్యా కూల్ హై హమ్ చిత్రానికి సీక్వెల్. తుషార్ కపూర్,రితీష్ దేశముఖ్ కలిసి నటించిన ఆ చిత్రం మంచి హిట్ ని సాధించింది.
ఇక వీళ్లతో చేసిన హీరోలు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ ఈ సంవత్సంరం హిట్స్ తో దూసుకుపోతున్నారు. రామ్ చరణ్ తొలి హిట్టుగా రచ్చని నమోదు చేసుకున్నాడు. సంపత్ నంది దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రం రామ్ చరణ్ లోని మాస్ యాంగిల్ కి అణుగుణంగా కథను అల్లుకుని హిట్ కొట్టింది. తమన్నా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో అభిమానులును అలరించేలా సీన్స్ ప్లాన్ చేసి సూపర్ హిట్ చేసుకున్నారు.
బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా అబ్బాయ్ దారిలోనే వెళ్లి...గబ్బర్ సింగ్ హిట్ కొట్టుకున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీ దబాంగ్ కి రీమేక్. పూర్తిగా మాస్ ఎలిమెంట్స్ ని కలిపి అబిమానలు చేత టప్పుట్లు కొట్టించేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేసి విజయం సాధించారు. ఈ చిత్రం తర్వాత మళ్లీ పవన్ ఫామ్ లోకి వచ్చేసారు. వీరితో చేసిన ఈ ఇద్దరు హీరోయిన్స్ మాత్రం హిందీలో ఇలా చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటున్నారు.


Click it and Unblock the Notifications











