2010పోతేపోయింది రాబోయే మార్చి మాదేనంటూ మెగా ఫ్యాన్స్
యువ హీరో అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన నిచ్చితార్థం కూడా ఇటీవలే జరిగింది. వీరి పెళ్లి మాత్రం ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న 'బద్రీనాథ్" షూటింగ్ ముగిసిన తర్వాతే వుంటుందని నిశ్చితార్థం రోజు వివరించారు. అయితే కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న 'బధ్రీనాథ్" చిత్రాన్ని మార్చిలో రిలీజ్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి.
కాగా అదే నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'లవ్లీ" చిత్రం కూడా మార్చి 28న రిలీజ్ కు సిద్దమవుతోంది. అదే నెల 6వ తేదీన అల్లు అర్జున్ పెళ్లి జరుగుతోందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. పవన్ చిత్రం మార్చిలో వుండటం వల్ల అల్లు అర్జున్ నటిస్తున్న 'బధ్రీనాథ్" చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమాచారం. అయితే మెగా అభిమానులు మాత్రం 2010లో త్రీవ నిరాశను పొందిన వారు మార్చిలో దానిని దూరం చేసుకునేందుకు తమ పవర్ చూపించేందుకు ఇప్పటినుండే సిద్దం అవుతున్నారంటే మెగా ఫ్యామిలీకి మార్చి పవర్ అలాంటిది మరి.


Click it and Unblock the Notifications











