ప్రభాస్ నాకు సరిజోడీ, రామ్ చరణ్ నా కొడుకు: నటి హేమ కామెంట్

Recommended Video

Hema Interesting Comments On Tollywood Hero's | Prabhas | Ram Charan | Nagarjuna | Chiranjeevi

టాలీవుడ్లో ఫైర్ బ్రాండ్ అనే ట్యాగ్ ఇవ్వగల అతికొద్ది మంది నటీమణుల్లో హేమ ఒకరు. ఏ విషయం అయినా మొహం మీదే అనేయడం, తన మనసులో ఏది ఉంటే అది ఓపెన్‌గా మాట్లాడగల ధైర్యం ఉన్న డేరింగ్ యటిట్యూడ్ ఆమె సొంతం. ఏదైనా అన్యాయం జరిగితే ఎంతటి వారినైనా నిలదీసే మనస్తత్వం ఉన్న లేడీ. అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఇటీవల జరిగిన 'మవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ భారీ మెజారిటీతో గెలుపొందారు. కొత్తగా ఎన్నికైన 'మా' కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కూడా కొత్త ప్రెసిడెంట్ నరేష్‌ను పలు అంశాలపై సభా ముఖంగా నిలిదీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమ టాలీవుడ్ స్టార్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆడవారికి న్యాయం జరిగేలా చూడాలని నన్ను నిలబెట్టారు

ఆడవారికి న్యాయం జరిగేలా చూడాలని నన్ను నిలబెట్టారు

‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మహిళలకు అన్ని విషయాల్లో సమన్యాయం జరిగేలా చూడాలనే ఆడవాళ్లంతా కలిసి నన్ను నిలబెట్టారు. ‘మా'లో ఏ నిర్ణయం తీసుకున్నా 800 మంది సభ్యులకు మంచి జరిగేలా ప్రయత్నం చేస్తాను, ఎవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రశ్నిస్తాను'' అని హేమ తెలిపారు.

చిరంజీవి స్పూర్తితో సినిమాల్లోకి..

చిరంజీవి స్పూర్తితో సినిమాల్లోకి..

బాగా నచ్చిన దర్శకుడు త్రివిక్రమ్, బాగా నచ్చిన సినిమా ‘అతడు'.. అని హేమ ఈ సందర్భంగా ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బాగా నచ్చిన హీరోల విషయానికొస్తే చిరంజీవి, నాగార్జున ఇద్దరూ ఇష్టమే, చిరంజీవిగారిని స్పూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.

రామ్ చరణ్ నా కొడుకు

రామ్ చరణ్ నా కొడుకు

రాఫిడ్ ఫైర్ రౌండ్లో హేమ ఆసక్తికరంగా వన్ వర్డ్ ఆన్సర్స్ ఇచ్చారు. ‘‘చిరంజీవి- హి ఈజ్ ఏ మెగాస్టార్.. నాగార్జున - హి ఈజ్ ఎ లవర్ బాయ్.. మహేష్ బాబు- పోకిరి నుంచి మ్యాన్లీ లుక్ ఉన్న హీరో, ప్రభాస్ తనకు సరిజోడైన హీరో(హైట్ పరంగా), బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా తన కష్టంతో పైకి వచ్చిన స్టైలిష్ స్టార్ బన్నీ... రామ్ చరణ్ నా కొడుకు.. జూ ఎన్టీఆర్ హార్డ్ వర్కర్'' అని హేమ తెలిపారు.

పవన్ కళ్యాణ్ గురించి నో కామెంట్...

పవన్ కళ్యాణ్ గురించి నో కామెంట్...

అయితే పవన్ కళ్యాణ్ గురించి అడిగినపుడు మాత్రం... హేమ ఎలాంటి సమాధానం చెప్పలేక పోయారు. అందుకు కారణం ఆయన రాజకీయాల్లో ఉండటమే అని స్పష్టం అవుతోంది. హేమ ఇటీవల వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X