Bro Pre Release Event: పవనేశ్వరుడి వద్దకు బండ్లన్న!.. ఒకే వేదికపై త్రివిక్రమ్, గణేష్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు... ఇలా బిజి బిజిగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం బ్రో. ఈ సినిమా జులై 28వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంటును మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ ఈవెంటుకు గెస్టుగా రామ్ చరణ్ తో పాటు.. నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కూడా రానున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

ఆకట్టుకుంటున్న ట్రైలర్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ బ్రో. ఇక ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్.. ఫ్యాన్స్ కే కాకుండా మామూలు సినీ లవర్స్ కూడా పూనకాలు తెప్పించింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, పాటలు.. మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Mega Power Star Ram Charan and Bandla Ganesh will be the guests for Pawan Kalyan Bro movie pre-release event News Goes Viral

ఫుల్ ప్రమోషన్స్: ఇక ఈ చిత్రాన్ని జులై 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో.. మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే ఈరోజు రాత్రి ప్రీరిలీజ్ వేడకను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. వర్షం కారణంగా ఈవెంటు ఆలస్యం అవుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఏర్పాట్లు మాత్రం జోరుగా చేస్తోంది. శిల్పకళావేదికలో ఈ బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటు ఏర్పాట్లు ఘనంగా చేశారు.

Mega Power Star Ram Charan and Bandla Ganesh will be the guests for Pawan Kalyan Bro movie pre-release event News Goes Viral

రామ్ చరణ్.. బండ్లన్న: ఇక ఈ ఈవెంటుకు పవన్ కల్యాణ్ వస్తాడా రాడా అనేది సందిగ్ధంగానే ఉంది. కానీ ఈ వేడుకకు రామ్ చరణ్ రానున్నారట. ఈయనతో పాటు.. మరో గెస్టు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. ఆయన ఎవరో కాదు.. నిర్మాత, నటుడు బండ్ల గణేష్. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పవన్‌పై ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడూ హైలెట్‌గా నిలుస్తాయి. ఆయన పొగడ్తలకు అభిమానులు ఫిదా అవుతుంటారు. అయితే పవన్ కల్యాణ్ ఆరాధ్యుడు అయిన బండ్లన్న వస్తుండటంపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Mega Power Star Ram Charan and Bandla Ganesh will be the guests for Pawan Kalyan Bro movie pre-release event News Goes Viral

అంతలా తిట్టి: ముఖ్యంగా త్రివిక్రమ్, బండ్లన్న వార్ గురించి అందరికీ తెలిసిందే. పవన్, బండ్ల గణేష్ మధ్య గ్యాప్ రావడానికి కారణం త్రివిక్రమ్ అని అప్పట్లో న్యూస్ వచ్చింది. ఇక పవన్ సినిమా ఈవెంట్లకు తనని రాకుండా త్రివిక్రమ్ అడ్డుపడ్డాడని, కావాలని తనను పిలవలేదని బండ్ల గణేష్ తీవ్రమైన పదజాలంతో అప్పట్లో దూషించిన ఆడియో లీక్ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఒకే స్టేజ్‌పైన త్రివిక్రమ్, బండ్ల గణేష్ కనిపిస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే: ఈ సినిమాను తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని డైరెక్ట్ చేయగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తుండగా.. వివేక్‌ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X