టాలీవుడ్ మగధీరుడి పుట్టిన రోజు నేడు
చిరుతలా టాలీవుడ్‌లో అడుగుపెట్టి... మగధీరతో రికార్డులు బద్దలుకొట్టిన ఆరెంజ్ బాయ్ రామ్ చరణ్ తేజ్. డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ అన్నింటా తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్న ఈ యంగ్ టాలెంట్ రెండో సినిమాకే కోట్లాదిమంది ఆడియన్స్ హృదయాల్ని కొల్లగొట్టి...హీరోగా తనకుతానే సాటి అని నిరూపించుకున్నాడు. రామ్ చరణ్ త్వరలో మరో ఇండస్ట్రీ హిట్ తో రచ్చ చేయడానికి సిద్దంగా ఉన్నాడు. రామ్ చరణ్ పుట్టిన రోజు నేడు . 1985 మార్చి 27న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించిన చెర్రీ నేటితో 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు. ఈ మెగా పవర్ స్టార్‌కి వన్ ఇండియా తరఫున బెస్ట్ విషెస్...
ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న రచ్చ చిత్రం ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పాటల చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం బిజీగా గడుపుతున్న చెర్రీ అన్నపూర్ణ స్టూడియోలో ఒక రోజు ముందుగానే మీడియా ప్రతినిధుల సమక్షంలో రచ్చ యూనిట్ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుక జరుపుకున్నాడు. ఈ చిత్రంలో చెర్రీ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం సమకూర్చాడు. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం మెగా అభిమానులు మెచ్చే అన్ని మాస్ మసాలా యాక్షన్ అంశాలతో కన్నుల విందుగా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











