పోలీసుల కోసం ‘అల్లూరి గెటప్’ పక్కన పెట్టా.. మూడు గంటల బాధను అలా భరించా.. రాంచరణ్ ఎమోషనల్
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ ఆవరణలో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిధి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్, సైబారాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు రాంచరణ్, నాగపూరి రమేష్ అందజేశారు. ఈ సందర్బంగా రాంచరణ్ మాట్లాడుతూ..

నాకు పోలీసుల కథలంటే ఇష్టం
నాకు పోలీసు కథలు అంటే ఇష్టం. చాలా ఇష్టం. అందుకే నేను ధృవ అనే చిత్రంలో నటించాను. ఈ స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. క్రీడల్లో పాల్గోనడం ముఖ్యం. గెలుపోటములు సహజం. వాటిని పట్టించుకోకుండా స్పూర్తిని చాటడం ప్రధానం. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో పోలీసులు బాగా పనిచేశారు అని రాంచరణ్ తెలిపారు.

పోలీసులకు ఎప్పుడూ సిద్దమే
మూడేళ్ల క్రితం షీ టీమ్స్‌కు సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యాను. పోలీసులకు సంబంధించి ఎలాంటి కార్యక్రమానికైనా రావడానికి ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాను. నా కెరీర్‌లో ధృవ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాను. ఈ సినిమాను ఎవరైనా పోలీస్ ఆఫీసర్ గానీ, ఐపీఎస్ ఆఫీసర్ నా పాత్రను, నా వేషధారణను తప్పుపట్టకూడదని చాలా జాగ్రత్తలు తీసుకొన్నాను అని రాంచరణ్ అన్నారు

పోలీస్ ఆఫీసర్ పాత్రను ఫర్‌ఫెక్ట్‌గా చేయాలని
ధృవ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రను ఫర్‌ఫెక్ట్‌గా చేయాలి. సెల్యూట్ సరిగా కొట్టాలనే తపనతో చాలా శిక్షణ పొందాను. పోలీస్ అధికారుల ప్రవర్తన గురించి స్టడీ చేశాను. ధృవ చిత్రంలోని పాత్రను ఛాలెంజ్‌గా తీసుకొని చేశాను. పోలీస్ ఆఫీసర్ పాత్రను సినీ తారలు తప్పుగా చేస్తారు. డ్రస్ కూడా సరిగా వేసుకోరనే విమర్శలు రాకుండా ఆ పాత్రను పోషించాను అని రాంచరణ్ తెలిపారు.

అల్లూరి గెటప్‌లో తీయడానికి కష్టపడ్డా
సైబరాబాద్ పోలీసుల స్పోర్ట్స్ మీట్ ముగింపు ఉత్సవాలకు రావాలని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆహ్వానించినప్పుడు సంతోషంగా ఒప్పుకొన్నాను. వాస్తవానికి RRR షూటింగ్‌కు సంబంధించిన అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్నాను. ఆ గెటప్ వేసుకోవడానికి గంటన్నర.. మేకప్ తీయడానికి మరో గంటన్నర సమయం పడుతుంది. అయినా ఆ కష్టాన్ని, బాధను పక్కన పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఓ గౌరవంగా భావించి వచ్చాను అని రాంచరణ్ పేర్కొన్నారు.
Recommended Video

వీసీ సజ్జనార్‌కు ధన్యవాదాలు
బరాబాద్ స్పోర్ట్స్ ముగింపు ఉత్సవాలకు వచ్చిన తర్వాత నాకు తెలిసినదేమిటంటే.. ఈ మీట్‌లో 500 మంది పోలీసులు, వారి కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నట్టు చెప్పారు. పోలీసులతోపాటు వారి కుటుంబాలు చాలా ఉత్సాహంతో పాల్గొనడానికి కారణమైన అధికారులకు, వీసీ సజ్జనార్‌కు మీ అందరి తరఫున నా ధన్యవాదాలు అంటూ రాంచరణ్ ఉద్వేగంగా ప్రసంగించారు.


Click it and Unblock the Notifications











