మాకు ఇలాంటి మొగుడే కావాలి : భార్య కోసం చరణ్ చేసిన పనికి అమ్మాయిలంతా ఫిదా!
టాలీవుడ్ మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంత అన్యోన్యంగా కలిసి ఉంటూ సంసార బాధ్యతల్ని చక్కగా పంచుకుంటారు. ఇప్పటికే ఎంతో మంది భార్యభర్తలకు నిదర్శనంగా నిలిచారు. అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ అన్యోన్య దాంపత్యానికి నిదర్శనంగా నిలిచారు. అమ్మాయిలు అయితే ఇలాంటి మొగుడే కావాలి అంటూ చరణ్‌ను తెగ ప్రశంసించేస్తున్నారు. ఇంతకీ భార్య కోసం చరణ్ ఏం పని చేశారు? దాని గురించే ఈ కథనం.
అత్యుత్తమ దాంపత్య జీవితాన్ని గడపడానికి ఉపాసన ఎప్పుడూ సలహాలు ఇస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. పరస్పర నమ్మకం, గౌరవం అనేది దాంపత్య జీవితంలో ఎంతో ముఖ్యమని, ఆధిపత్యం అనేది అస్సలు చూపించకూడదని, బాధ్యతల్ని పంచుకోవాలని ఇప్పటికే ఉపాసన చాలా సార్లు చెప్పారు. తన భర్తతో ఉన్న బంధాన్ని వివరిస్తూ... తామెప్పుడూ బాధ్యతల్ని పంచుకుంటామని, పరస్పరం గౌరవించుకుంటామని కూడా అన్నారు. అయితే తాజాగా ఈ క్యూట్ కపుల్ బంధానికి నిదర్శనంగా ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడం మొదలైంది.

ఇది చూసిన అభిమానులు, సాధారణ ప్రజలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఎంత గ్లోబల్ స్టార్ అయినా కూడా భార్యకు భర్తే కదా? రామ్ చరణ్ ఎంత డౌన్ టు ఎర్త్, భార్యకు ఎంత విలువ ఇస్తాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అంటూ వారంతా విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ప్రస్తుతం అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ పనులు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. దీనికి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు విచ్చేసి సందడి చేస్తున్నారు. అలా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరుగుతున్న ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి రామ్‌చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. దీంతో శుక్రవారం ప్రత్యేక విమానంలో ఈ జంట అక్కడికి బయటలు దేరింది. ఆ సమయంలోనే విమానంలో ఉపాసన కునుకు తీస్తుంటే చరణ్ ఆమె కాళ్లు నొక్కుతూ కనిపించారు. అక్కడే ఉన్నవాళ్లు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది క్షణాల్లో అది వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోని ఎవరు తీశారు? ఎలా బయటకు వచ్చిందన్నది క్లారిటీ అవ్వలేదు.

ఇక ఇది చూసిన అభిమానులే పైవిధంగా కామెంట్లు చేస్తున్నారు. చరణ్ బెస్ట్ హస్బెండ్ అవార్డ్ ఇవ్వాల్సిందే, అమ్మాయిలకు ఇలాంటి మొగుడే కావాలి అంటూ చెబుతున్నారు. అయితే భార్యకు సేవ చేయడం చరణ్‌కు ఇదేమి కొత్త కాదు. ఇంటి పనుల్లోనూ సాయం చేస్తారు. షాపింగ్‌కు వెళ్తే బ్యాగులు మోయడం కూడా చేస్తుంటారు. తామిద్దరూ సమానమే అన్న విషయాన్ని ఎప్పుడూ తు.చ తప్పకుండా పాటిస్తారు.
కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ అనే పొలిటికల్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











