twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనివార్య కారణాల వలన ఓటేయలేకపోతున్నా:రాంచరణ్.. తేజు, రామ్ ఏమన్నారంటే!

    |

    తెలంగాణ ఎన్నికల సందర్భంగా సినీలోకం కోసం ఓటేసేందుకు కదిలారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, రాజమౌళి, నితిన్ ఇలా సినీ ప్రముఖులంతా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటు హక్కుని వినియోగించుకోవడమే కాదు.. ప్రజలందరినీ చైతన్యపరుస్తున్నారు. మన హక్కులు పరిరక్షించుకోవాలంటే ఓటు హక్కు వినియోగించుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ మాత్రం ఓటు వేయకుండా నిరాశపరిచాడు. హీరో రామ్, సాయిధరమ్ తేజ్ ఓటు వేసిన తర్వాత సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారు. ఆ వివరాలు చూద్దాం.

    చాలా నిరాశగా ఉంది

    రాంచరణ్ తన పేస్ బుక్ పేజీలో స్పందిస్తూ.. తెలంగాణ ఎన్నికల సందర్భంగా తాను ఓటు వేయలేకపోతున్నానని తెలిపాడు. అందుకు చాలా నిరాశగా ఉంది. అనివార్య కారణాల వలనే తాను ఓటింగ్ కి దూరంగా ఉన్నట్లు రాంచరణ్ తెలిపాడు. దయచేసి ప్రజలంతా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని రాంచరణ్ కోరాడు. రాంచరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే.

    నాది నాదే అంటున్న రామ్

    ఇక యువ హీరో రామ్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. ఓటు వేసిన అనంతరం తన వేలిని చూపిస్తూ నాది నాదే.. మరి మీది అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఓటర్లని ఉత్తేజపరచడం కోసం రామ్ ఈ కామెంట్ పెట్టాడు. ఈ ఫోటో చూస్తుంటే రామ్ కొత్త చిత్రం కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త హెయిర్ స్టైల్, గుబురు గడ్డంతో రామ్ కనిపిస్తున్నాడు.

    అది కూడా మనదే తమ్ముడు

    నాది నాదే.. మరి మీది అనే రామ్ కామెంట్ పై ఓ నెటిజన్ మాది ఆంధ్రాలే అంటూ వెటకారంగా స్పందించాడు. దీనికి రామ్ సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చాడు. అది కూడా మనదే తమ్ముడూ.. ఇక సీఎం సరిపోలేదని ఇద్దరికీ ఇచ్చాం అంతే. విడిపోలేదు.. విడదీశాము.. రెండు మనవే అంటూ సదరు నెటిజన్ కు రిప్లయ్ ఇచ్చాడు.

    మరక మంచిదే

    మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరక మంచిదే అంటూ కామెంట్ పెట్టాడు. తేజు ప్రస్తుతం చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. కళ్యాణి ప్రయదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో తేజు గుబురు గడ్డంతో సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నాడు. వరుస పరాజయాల్లో ఉన్నా సాయిధరమ్ తేజ్ కు చిత్రలహరి చాలా కీలకం.

    English summary
    Mega power star Ram Charan not able to cast his vote. Here is the reason
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X