‘పులి’ మిడ్ నైట్ సాంగ్ కి ‘పవన్’ కోఆపరేషన్!

By Sindhu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కొమరం పులి" బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను షేక్ చేయడానికి ఎంతో ఆత్రుతగా ఉన్నాడు. అయితే ఫైనల్ సాంగ్ మిడ్ నైట్ లో చేయవలసి ఉండగా పవన్ మైనర్ హెల్త్ ప్రాబ్లమ్ వలన చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ చాలా పక్చువాలిటి ఉన్న పర్సన్ అతను డైలీ 9 పిఎమ్ కే నిద్రపోతారు. సాంగ్ నైట్ లైట్ లో తీయవలసి వుండగా పవన్ కళ్యాణ్ కోఆపరేట్ చేయడంతో రామోజి ఫిల్మ్ సిటిలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది.

అయితే ఇంతకు ముందే పులి టైటిల్ సాంగ్ లీక్ అవ్వడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే మాట ప్రతీ నోటా వినిపిస్తోంది. ఆ పాట విన్న వాళ్లు కొందరే అయినప్పటికీ 'పులి" టైటిల్ సాంగ్ అదిరింది అనే టాక్ మాత్రం అందరికీ పాకిపోయింది. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ 'పులి" చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. 'ఖుషి" లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ఎస్ జె సూర్య కలిసి చేస్తోన్న చిత్రమిదే. ఈ సినిమా కోసం ఇప్పటికే ఆరు అద్బుతమైన పాటలు ఇచ్చిన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ ప్రస్తుతం లండన్ లో'పులి" కి రీ రికార్డింగ్ చేయిస్తున్నారు.

ముఖ్యంగా 'పులి" టైటిల్ సాంగ్ కోసం రెహమాన్ తో ప్రత్యేకంగా చర్చించిన ఎస్ జె సూర్య ఆయన దగ్గర్నుంచి ఓ ఎక్స్టాట్రార్డినరీ ట్యూన్ రాబట్టుకుని పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా 'పవర్ స్టార్ పవర్ స్టార్" అనే లిరిక్ తో సాంగ్ చేయించుకున్నారట. ఆ పాటే ఆ నోటా ఈ నోటా పాపులర్ అయిపోయి ఆడియో రిలీజ్ కి ముందే ఇప్పుడంతటా మెగా రెస్పాన్స్ దక్కించుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X