రామ్ చరణ్ మెరుపు డైరెక్టర్ కి మెగా షాక్ ఇచ్చిన చిరు...
ఆరెంజ్ ని ఆహా..ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేసిన రామ్ చరణ్ అది కాస్తా ప్లాప్ అయ్యాక 'మెరుపు" చిత్రం మీద కూడా అనుమానాన్ని పెంచుకుని ఇష్టానుసారం దర్శకుడు ధరణిని వేధించడం ప్రారంభించాడు. పేరుకు తగ్గట్టు సహాసమున్నోడు కాబట్టి అవన్ని భరించి మొత్తానికి తొలి షెడ్యూల్ పూర్తి చేయగలిగాడు. నిర్ణయించుకున్న 40కోట్ల బడ్జెట్ దాటిపోయే సూచనలు కనిపిస్తుండటంతో ప్రస్తుతానికి షూటింగ్ ఆపేసారని సమాచారం.
ఆరెంజ్ పరిణామాల ప్రభావం నుండి ఇంకా కోలుకోలేని మెగా కుటుంబం చివరికి నియంత్రణ లేని ధరణిని మార్చుకోవాలని చిరంజీవి చేసిన సూచన మేరకు ఆయన్ని తప్పించి వేరే దర్శకుడ్ని పెట్టుకుని సినిమాని పూర్తి చేయాలన్న భావనలో ధరణిని తప్పించేసి 'మెగా" షాక్ చూపించారని తెలుస్తోంది. ఇప్పటికే పడుతూ లేస్తూ ఒక్కొక్కరూ తప్పుకుంటున్న 'మెరుపు" ప్లోరెక్కేదెప్పుడో..జనాల్ని ఆకర్షించేలా ఉంటుందో లేదో అనుమానమే..


Click it and Unblock the Notifications











