»   » 151 సురేందర్ రెడ్డితో, 152 బోయపాటితో: చిరంజీవి ప్రకటన

151 సురేందర్ రెడ్డితో, 152 బోయపాటితో: చిరంజీవి ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాస్ ఈజ్ బ్యాక్....మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 చిత్రం అంచనాలకు మించిన విజయం సాధించింది. తెలుగు సినిమా చరిత్రలోనే వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక అభిమానుంతా చిరంజీవి వరుస సినిమాలు చేయాలని కోరకుంటున్నారు. ఆయన కూడా అభిమానుల అభీష్టం మేరకు వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు.

2017 సంవత్సరంలో మెగాస్టార్ రెండు సినిమాలు చేయబోతున్నారు. త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 151 చిత్రం ప్రారంభించబోతున్నారు. దీని తర్వాత 152వ చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో చేయబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖరారు చేసారు.

Mega Star Chiranjeevi 151 Movie Confirmed with Surendar Reddy

ఈచిత్రాన్ని కూడా రామ్ చరణే నిర్మించబోతున్నారు. సురేందర్ రెడ్డి చెర్రీతో ఇటీవల 'ధృవ' లాంటి భారీ హిట్ ఇచ్చిన నేపథ్యంలో సూరిపై నమ్మకంతో నాన్న 151 సినిమాను అతడికే అప్పగించాడు చరణ్.

ఇక 152వ చిత్రం గీతా ఆర్ట్స్ బేనర్లో అల్లు అరవింద్ నిర్మాణంలో ఉండబోతోంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నారు. అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో మాస్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఇకపై సంవత్సరానికి రెండు సినిమాల చొప్పున మెగాస్టార్ వరుస సినిమాలు చేయబోతున్నారు. 150వ చిత్రం కోసం బోలెడన్ని కథలు విన్నా. అందులో రెండు మూడు కథలు బాగా నచ్చాయి. వాటిపై కూడా ఇపుడు కసరత్తులు చేస్తున్నట్లు మెగాస్టార్ తెలిపారు.

English summary
Mega Star Chiranjeevi 151 Movie Confirmed with Surendar Reddy. This movie also will produced by Ram Charan. Chiru’s prestigious 152nd film will be helmed by Boyapati Srinu. It is being produced by Allu Aravind under his home banner Geetha Arts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu