‘సైరా’లో ఒళ్లు గగుర్బొడిచేలా.. నాకు సంబంధంలేకున్నా, అది గొప్పగిఫ్ట్: సిరివెన్నెలపై చిరంజీవి

Recommended Video

Mega Star Chiranjeevi About Sirivennela and Sye Raa Movie Songs | Filmibeat Telugu

ప్రముఖ తెలుగు సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా సిరివెన్నెలపై మెగాస్టార్ ప్రశంసల వర్షం కురిపించారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రితో నా ప్రయాణం 'వేట' దగ్గర నుంచి కొనసాగుతోంది అంటూ ఆయనతో కలిసి చేసిన సినిమాల గురించి మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన మనసులోని భావాలను చిరంజీవి మీడియాతో పంచుకున్నారు.

ఇప్పటికీ నాకు ఆ విషయంలో అసంతృప్తి ఉంది

ఇప్పటికీ నాకు ఆ విషయంలో అసంతృప్తి ఉంది

‘రుద్రవీణ'లో ఆయన ఇచ్చిన సాహిత్యం ఎప్పటికీ మరిచిపోలేనటువంటి గొప్ప సాహిత్యం. తృటిలో నేషనల్ అవార్డ్ తప్పిందని ఇప్పటికీ నాకు బాధ, అంతృప్తి ఉంటుంది. కానీ ఆయన దాన్ని కొట్టిపారేస్తుంటారు. రాకపోతే ఏముంది మిత్రమా.. నాకు ప్రజల దగ్గర నుంచి వచ్చిన ప్రశంస చాలు, వాళ్ల గుండెల్లో ఇచ్చిన సాహితీ పీఠం చాలు అంటూ తృప్తి చెందే మనిషి అని చిరంజీవి అన్నారు.

సైరాలో ఒళ్లు గగుర్బొడిచే సాహిత్యం

సైరాలో ఒళ్లు గగుర్బొడిచే సాహిత్యం

ఈ రోజు సైరా నరసింహారెడ్డిలో అన్ని పాటలు ఆయనే రాస్తున్నారు. ఇది నిర్మాత చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, నేను తీసుకున్న నిర్ణయం. ఆయన ఒళ్లు గగుర్బొడిచే సాహిత్యం అందించారు. ఈ సినిమాతో ఆయనకు నేషనల్ అవార్డ్ రావాలి, వస్తుందనే ఆశాభావం నాలో ఉందని తెలిపారు.

అది మరిచిపోలేని గొప్ప గిఫ్టు

అది మరిచిపోలేని గొప్ప గిఫ్టు

నా సినిమాల్లో నా క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకుని, వ్యక్తిగత ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని పాట రాయడం ఒక ఎత్తు. నాకు సంబంధం లేని సినిమాలో, నా గురించి ప్రస్తావిస్తూ పాట రాయడం ఇప్పటికీ మరిచిపోలేని గొప్ప గిఫ్టుగా ఫీలవుతున్నట్లు చిరు తెలిపారు.

నా కష్టానికి అందమైన అక్షర రూపం

నా కష్టానికి అందమైన అక్షర రూపం

నా సినిమాలో పాటలు రాయడం సహజం. కానీ ‘అనుకోకుండా ఒకరోజు' సినిమాలో ఎవరైనా చూసుంటారా.. నడిచే నక్షత్రాన్ని అనే లైన్ విన్నపుడు.. నా గత జీవితం, నేను సాధించినవి, పడ్డ కష్టం అక్షర రూపంలో అందంగా తెలియజెప్పారు అని మోషన్‌కు గురవుతుంటానని మెగాస్టార్ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X