For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మీరంతా గ‌ర్వ‌ప‌డేలా చేస్తా, రాజమౌళి ఆశీస్సులు శుభ సూచకం : చిరంజీవి

  By Bojja Kumar
  |

  మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 'సై రా నరిసింహా రెడ్డి' ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అభిమానులు, సినీ రంగానికి చెందిన అతిథుల సమక్షంలో భారీ వేడుకలా సాగింది. ఈ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి హాజరు కాలేదు. అయితే ఆయన మాట్లాడిన వీడియో సందేశం వేడుకలో వినిపించారు.

  ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా ప‌రోక్షంగా అభిమానుల‌ను క‌లుసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజు నాకు చాలా ప్ర‌త్యేకం. దానికి కార‌ణం నా వృత్తి సినిమా...నా ప్ర‌వృత్తి సినిమా. ఈ రెండు అనుభూతుల‌ను ఈరోజు ఇక్క‌డ ఆవిష్క‌రించ‌డం చాలా సంతోషంగా ఉంది' అన్నారు.

  మీరు గర్వపడేలా చేస్తా

  మీరు గర్వపడేలా చేస్తా

  నా త‌ల్లిదండ్రులు చేసిన పూజ‌లో లేకే నేను చేసుకున్న పుణ్య‌మో గానీ ఇంత మంది అభిమానులను నాకిచ్చారు. ప్ర‌పంచ వ్యాప్త‌గాను ఇంతే అద‌ర‌ణ చూపిస్తున్నారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటిది మీ కోసం ఏం చేయ‌డానికైనా సిద్దంగా ఉన్నాను. మీరు గ‌ర్వ‌ప‌డేలా సినిమాలు చేయ‌గ‌ల‌ను. ప‌ది కాల‌ల పాటు చెప్పుకునే పాత్ర‌లు చేయ‌గ‌ల‌ను. అందుకే 151వ సినిమాగా స్వాంత్ర‌త్య స‌మ‌ర మోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ను తీసుకున్నామని చిరంజీవి తెలిపారు.

  Chiranjeevi's 151 movie "SAIRA" Motion Poster Released.
  ఇన్నాళ్లకు గొప్ప అవకాశం

  ఇన్నాళ్లకు గొప్ప అవకాశం

  ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ పాత్ర చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ఉంది. అందులో భ‌గ‌త్ సింగ్ పాత్ర‌లో న‌టించాల‌ని చాలా సార్లు అనుకున్నాను. ఇన్నాళ్ల‌కు ఉయ్యాల వాడ రూపంలో నా ఆశ‌ల‌కు, మీ ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తి రూపంగా నిలిచే పాత్ర దొరికింది. మ‌న స్వాంత్రత్య పోరాటానికి ఆధ్యులు, పోరాడే యోదులంద‌రికీ ఆరాధ్యులు మ‌న తెలుగు బిడ్డ అయిన ఉయ్యాల వాడ పాత్ర దొర‌క‌డం గొప్ప అవ‌కాశం... అని చిరంజీవి అభిప్రాయ పడ్డారు.

  అద్భుత దృశ్యకావ్యం అవుతుంది

  అద్భుత దృశ్యకావ్యం అవుతుంది

  అత్యాధునికి సాంకేతిక బృదంతో, విలువ‌లుతో డైన‌మిక్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుంది. సినిమా కోసం ఆయ‌న తీసుకున్న శ్ర‌ద్ద, శ‌క్తుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా అద్భుత దృశ్యకావ్యం అవుతుంద‌డంలో ఎలాంటి సందేహం లేదు. మెగా అభిమానులంతా గ‌ర్వ‌ప‌డే సినిమా అవుతుంది అని చిరంజీవి అన్నారు.

  రాజమౌళి ఆశీస్సులు శుభ సూచకం

  రాజమౌళి ఆశీస్సులు శుభ సూచకం

  ఈ సినిమాపై అభిమానుల న‌మ్మకాన్ని మ‌రింత పెంచేలా ద‌ర్శ‌క‌బాహుబ‌లి రాజ‌మౌళి గారు ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగువాళ్లు గ‌ర్వించేలా ఓ చ‌రిత్ర సృష్టించిన ద‌ర్శ‌కుడు రాజమౌళి ఆశీస్సులు అందుకోవ‌డం నిర్మాత చ‌ర‌ణ్‌కు, ఈ సినిమాకు మంచి శుభ సూచికం` అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

  సైరా న‌ర‌సింహారెడ్డి పేరు చెబితేనే నాకు ఒణుకు పుడుతుంది

  సైరా న‌ర‌సింహారెడ్డి పేరు చెబితేనే నాకు ఒణుకు పుడుతుంది

  చిత్ర ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ,` సైరా న‌ర‌సింహారెడ్డి పేరు చెబితేనే నాకు ఒణుకు పుడుతుంది. చాలా పెద్ద బాధ్య‌త నాపై పెట్టారు. నా ఫోక‌స్ మొత్తం సైరా పైనే. దాన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ చేయ‌డ‌మే నా ముందున్న ల‌క్ష్యం. నాకు మెగాస్టార్ చిరంజీవిగారు, రామ్ చ‌ర‌ణ్ స‌పోర్ట్ ఉంది. దాంతో నా కుటుంబ స‌భ్యులు, మెగా అభిమానుల స‌హ‌కారం కూడా ఉంది` అని అన్నారు.

  చ‌రిత్ర పుస్త‌కాల్లోకి వ‌చ్చేస్తుంది

  చ‌రిత్ర పుస్త‌కాల్లోకి వ‌చ్చేస్తుంది

  ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ మాట్లాడుతూ...`భార‌త‌దేశ చ‌రిత్ర‌లో 1857 లో తొలి స్వాంతంత్ర్య పోరాటం ఎక్క‌డ అంటే ఝాన్సీ రాణి అని పుస్త‌కాల్లో ఉంది. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత అది మారిపోయి తెల్ల‌వాడిని చూసి తొడ‌గొట్టిన మొన‌గాడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి అని చ‌రిత్ర పుస్త‌కాల్లోకి వ‌చ్చేస్తుంది. మ‌రుగున ప‌డిన‌ చ‌రిత్రకారుడిని ఈ సినిమా వెలుగులోకి తెస్తుంది' అన్నారు.

  English summary
  Mega Star Chiranjeevi about "Sye Raa Narasimha Reddy". After the sensational success of Khaidi No 150, Megastar Chiranjeevi is arriving with a historical period drama, "SYE RAA NARASIMHA REDDY"along with ace director Surender Reddy. This prestigious project will be bankrolled by actor-producer Ram Charan under Konidela Production Company.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X