twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మీదేవి శిష్యుడినైనందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా.. చిరంజీవి ఉద్వేగం.. రాజీవ్, సుమ కనకాల కంటతడి

    By Rajababu
    |

    నాటక రంగంలో ప్రముఖ నటి, నట శిక్షకులు లక్ష్మీదేవి కనకాల శనివారం ఉదయం మరణించారు. సినీ రంగంలో రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ దిగ్గజ నటులను సినిమా రంగంలో రాణించడానికి లక్ష్మీదేవి కనకాల పాత్ర విశేషమైంది. వృద్యాప్యానికి సంబంధించిన అనారోగ్య కారణాలతో ఫిబ్రవరి 3, 2018 రోజు ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. లక్ష్మీదేవి మరణంపై మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షుడు శివాజీ రాజా తదితరులు తమ సంతాపాన్ని వెల్లడించారు. చిరంజీవి ఓ ప్రత్యేక ప్రకటనలో సంతాపాన్ని వ్యక్తం చేశారు.

    Recommended Video

    విషాదంలో యాంకర్ సుమ
     లక్ష్మీ దేవి.. సరస్వతీ దేవి

    లక్ష్మీ దేవి.. సరస్వతీ దేవి

    పేరు లక్ష్మీ దేవి అయినా ఆమె నా పాలిట సరస్వతీ దేవి. ఆమె పాఠాలే నా పాఠవాలకి మూలం. నటనలో ఆమె నేర్పిన మెళకువలే నాలోని నటుడికి మెలుకువలు. లక్షలాది కుటుంబాలకి అభిమాన కథానాయకుడిగా ఎంత సంతోషపడతానో.. లక్ష్మీదేవి గారి శిష్యుడిగా అంత గర్వపడుతున్నాను.

     సినీ పరిశ్రమకు తీరని లోటు

    సినీ పరిశ్రమకు తీరని లోటు

    లక్ష్మీ దేవి కనకాల భౌతికంగా దూరమవ్వడం తీరనిలోటు. నాకే కాదు తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతీ మనసుకి ఇవి బరువైన క్షణాలు. అలా బరువెక్కిన మనుసుతో నా చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నా. కనకాల కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలిజ‌య‌జేస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ప్రకటనలో తెలిపారు.

     రాజీవ్‌కు ఫోన్‌లో పరామర్శ

    రాజీవ్‌కు ఫోన్‌లో పరామర్శ

    కాగా మెగాస్టార్ చిరంజీవి హైద‌రాబాద్ నగరంలో లేని కార‌ణంగా కనకాల దేవ‌దాస్, ల‌క్ష్మీదేవి దంపతుల కుమారుడు రాజీవ్ క‌న‌కాల‌ను ఫోన్‌కాల్ ద్వారా ప‌రామ‌ర్శించారు.

    అంత్యక్రియలు శనివారమే

    అంత్యక్రియలు శనివారమే

    నా మాతృమూర్తి గుండెపోటు కారణంగా కన్ను మూశారు. యాక్టింగ్ స్కూల్ ద్వారా అనేకమందికి మా తల్లి నటనలో ఓనమాలు దిద్దించిన ఘనతను సొంతం చేసుకొన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో లక్ష్మీదేవి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం అని రాజీవ్ కనకాల తెలిపారు.

    మాతృమూర్తిది సంపూర్ణమైన జీవితం!

    మాతృమూర్తిది సంపూర్ణమైన జీవితం!

    ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. అమ్మది సంపూర్ణమైన జీవితం. నట శిక్షకురాలిగా ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు. నటుడిగా, నటిగా చిత్రపరిశ్రమలో పేరు తెచ్చుకోవాలని ప్రయతించే ప్రతి ఒక్కరినీ తన కన్నబిడ్డలా చేరదీసింది. నిన్నటి (శుక్రవారం)వరకూఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ఆఫ్ ఆంధ్రప్రదేశ్ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వర్తించింది" అన్నారు.

    కన్నకూతురిలా చూసుకొన్నారు..

    కన్నకూతురిలా చూసుకొన్నారు..

    రాజీవ్ సతీమణి, ప్రముఖ యాంకర్, నటిసుమ అత్తగారితో ఆమె అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నన్నుకోడలిగా కాకుండా కన్నా కూతురిలా చూసుకున్నారు అని సుమ తెలిపారు. లక్ష్మీదేవి 'మాస్టారు కాపురం','మాయలోడు'తదితరచిత్రాల్లో నటిగా అద్భుతమైన పాత్రలు పోషించారు. మొత్తంగా ఆరు చిత్రాల్లో ఆమె నటించారు.

    English summary
    Devdas Kanakala wife left her last breath on today morning at a private hospital in Hyderabad. She was 78, suffering from some health-related issues from past couple of months.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X