పుట్టెడు దు:ఖంలో శ్రీకాంత్.. పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు మృతిపట్ల తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 11 .45 గంటల ప్రాంతంలో మరణించారు. పితృ వియోగంతో విషాదంలో కూరుకుపోయిన శ్రీకాంత్‌ను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు.
శ్రీకాంత్ తండ్రి మరణ వార్త వినగానే వెంటనే చిరంజీవి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. పరమేశ్వరరావు పార్థీవ దేహంపై పుష్ఫగుచ్ఛం పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పుట్టెడు దు:ఖంలో ఉన్న శ్రీకాంత్‌ను ఓదార్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిరంజీవితో శ్రీకాంత్ ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లదనే విషయం తెలిసిందే.

1948 మార్చి 16వ తేదీన కృష్ణా జిల్లా మేకా వారి పాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.

కొద్దికాలంగా వృద్దాప్య సంబంధమైన, అలాగే ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు మాసాలుగా స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఫిబ్రవరి 17న సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











