twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను పిలిస్తే ఆయన రాలేదు, డిసప్పాయింట్ అయ్యా : ‘ఛలో’ వేదికపై చిరంజీవి

    By Bojja Kumar
    |

    Recommended Video

    డిసప్పాయింట్ అయ్యా.. ‘ఛలో’ వేదికపై చిరంజీవి..!

    "ఊహ‌లు గుస‌గుస‌లాడే", "దిక్కులు చూడ‌కు రామ‌య్య‌", "ల‌క్ష్మిరావే మా ఇంటికి", "క‌ళ్యాణ‌ వైభోగం"," జ్యో అచ్యుతానంద" లాంటి విభిన్న క‌థాంశాల‌తో అలరించిన నాగ‌శౌర్య హీరోగా తాజాగా 'ఛలో' అనే చిత్రం తెరకెక్కుతోంది. వెంకీ కుడుముల దర్శకుడు. ఫిబ్రవరి 2న సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురువారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

    నన్ను కలిసేందుకు చాలా ట్రై చేశాడు

    నన్ను కలిసేందుకు చాలా ట్రై చేశాడు

    చిరంజీవి, నాగ శౌర్య కలిసి ఎక్కడా ఒక ఫోటోగ్రాఫ్ కూడా లేదు, నాగ శౌర్య ఫంక్షన్ కు చిరంజీవి రావడం ఏమిటి? అని మీకు అనిపించవచ్చు. నన్ను కలవాలని మా ఆఫీసుకు శౌర్య రెండు మూడు సార్లు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. కానీ నేను అందుబాటులో లేక రెస్పాన్స్ కాలేక పోయాను. మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తున్నాడని తెలిసేసరికి ఏమిటి విషయం అని తెలుసుకునేందుకు రమ్మని పిలిపించాను. తన ‘ఛలో' సినిమా ఫంక్షన్ కోసం నన్ను రావాలని కోరాడు..... అని చిరంజీవి తెలిపారు.

    నేను నా గతంలోకి వెళ్లాను

    నేను నా గతంలోకి వెళ్లాను

    నాగ శౌర్య వారి తల్లి ఉషగారితో ఇంటికి వచ్చినపుడు తను ఒకటే కోరాడు. మేము ఫంక్షన్ చేసుకుంటున్నాం మీరు రావాలి అని అడగ్గానే నేను ఎక్కువ సేపు ఆలోచించలేదు. వెంటనే వస్తాను అన్నాను. అలా అనడానికి ముందు నేను నా గతంలోకి వెళ్లాను. నేను నా కెరీర్ బిగినింగులో నా సినిమాకు ఫంక్షన్‌కు నేను అభిమానించే పెద్ద స్టార్‌ను పిలిచినపుడు బిజీగా ఉండి రాలేక పోయారు. ఆయన లేకుండా ఫంక్షన్ తూతూ మంత్రంగా చేసుకున్నాం... అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

    ఆరోజు నేను డిసప్పాయింట్ అయ్యాను

    ఆరోజు నేను డిసప్పాయింట్ అయ్యాను

    ఆ రోజు నేను అభిమానించే స్టార్ నా ఫంక్షన్‌కు రాలేక పోవడంతో చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఆయన వచ్చి ఉంటే ఆ ఉత్సాహం, ప్రోత్సాహం వేరేలా ఉండేది అనిపించింది. అది గుర్తుకు వచ్చినపుడు నాగ శౌర్యలో నన్ను నేను చూశాను. నాలాంటి వాడు ఆ ఫంక్షన్ కు వెళితే వచ్చే ఉత్సాహం, ప్రోత్సాహం వేరుగా ఉంటుంది అనిపించింది. తనకు ఆ ప్రోత్సాహం ఇవ్వాలి, ఉత్సాహ పరచాలి అని వచ్చాను. ఒక ఆర్టిస్టుకు ఇది ఎంత స్పిరిట్ ఇస్తుందనే విషయం నాకు తెలుసు. ఇలాంటివి స్వయంగా నా కెరీర్లో చూశాను. అలాంటి ఫీలింగ్ నాగ శౌర్యకు ఇవ్వాడానికి వచ్చాను... అని చిరంజీవి తెలిపారు.

    నాగ శౌర్య సినిమాలు చూడలేదు

    నాగ శౌర్య సినిమాలు చూడలేదు

    వాస్తవంగా చెప్పాలంటే నాగ శౌర్య సినిమాలు పెద్ద స్క్రీన్ మీద ఏదీ చూడలేదు. కానీ మా నిహారికతో చేసిన సినిమా మాత్రం టీవీలో చూశాను. చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాడు, స్మార్ట్ గా ఉన్నాడు, ఇలాంటి హీరో కావాలి, రావాలి, అప్పుడే ఈ పరిశ్రమకు ఒక ప్రెష్ నెస్ ఉంటుందని అనిపించింది. ఇలాంటి వారు వస్తేనే ఇండస్ట్రీకి కొత్త రక్తం వచ్చినట్లు ఉంటుంది.... అని చిరంజీవి తెలిపారు.

    కొత్తవారిని ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు

    కొత్తవారిని ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు

    గడిచిన రెండుమూడేళ్లుగా తీసుకుంటే పెద్ద హీరోలతో సమానంగా కొత్త హీరోల సినిమాలు హిట్టయ్యాయి. ఉయ్యాల జంపాల, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, ఊహలు గుస గుసలాడే, శతమానం భవతి, ఫిదా, హలో చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. కొత్తవారిని తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. ఆ రకంగా ‘ఛలో' కూడా మంచి విజయం సాధించాలని, నాగ శౌర్యకు కెరీర్లో ఇది ది బెస్ట్ చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నారు.... అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

    ట్రైలర్ నచ్చింది

    ట్రైలర్ నచ్చింది

    ఇటీవలే ‘ఛలో' ట్రైలర్ చూశాను. చూస్తుంటే అది ‘ఆంధ్ర-తమిళనాడు' బోర్డర్ లో జరిగిన ప్రేమ కథా చిత్రంగా అనిపించింది. సినిమా చూడాలనే ఉత్సాహం పెరిగింది. ఈ చిత్రం అందరినీ అలరించే సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను.... అని చిరంజీవి ఆకాంక్షించారు.

    మళ్లీ జన్మంటూ ఉంటే మెగాస్టార్ అభిమానిగా పుడతా: నాగ శౌర్య

    మళ్లీ జన్మంటూ ఉంటే మెగాస్టార్ అభిమానిగా పుడతా: నాగ శౌర్య

    మెగాస్టార్ తో పోలిస్తే నేను చాలా చాలా చిన్న వాడిని. నాకు మళ్లీ జన్మంటూ ఉంటే మా అమ్మా నాన్నకు కొడుకుగా పుడతాను, మెగాస్టార్ అభిమానిగా పుడతాను. నాలాంటి ఒక చిన్న నటుడికి సపోర్టు చేసినందుకు థాంక్స్ అంటూ నా గచౌశర్య కాస్త ఎమోషనల్ అయ్యారు.

    తారాగణం

    తారాగణం

    నటీనటులు - నాగశౌర్య, రష్మిక మండన్న, నరేష్, పోసాని, రఘు బాబు, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, ప్రవీణ్, సత్య, వైవా హర్ష, వేణు గోపాల రావు, మెట్ట రాజేంద్రన్, ప్రగతి, స్వప్ని, సుదర్శన్, జీవా తదితరులు

    నాగ శౌర్య సొంత బేనర్

    నాగ శౌర్య సొంత బేనర్

    ‘ఛలో' చిత్రం నాగ శౌర్య సొంతబేనర్లో తెరకెక్కుతోంది. శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో, నాగ శైర్య తల్లి ఉష, సోదరుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Watch Mega Star Chiranjeevi Fantastic Speech at Chalo Movie Pre Release Event. Chalo is a 2018 Telugu film directed by Venky Kudumula under Ira Creations Banner. Stay tuned for more updates and subscribe to this channel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X