సమ్మోహనం యూనిట్‌కు చిరంజీవి శుభాకాంక్షలు... (వీడియో)
సమ్మోహనం చిత్ర టీజర్ మేడే రోజున సాయంత్రం 5.09 గంటలకు మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఓ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో సుధీర్‌బాబు, అదితిరావు జంటగా నటిస్తున్న చిత్రం సమ్మోహనం. సమ్మోహనం అనే టైటిల్ ఎంత ఆకర్షణీయంగా ఉందో.. అంతే రేంజ్‌లో ప్రేక్షకులు ఆకర్షింపబడుతారన్నడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ సినిమా చూస్తూ సమ్మోహనులు అవుతారనే నమ్మకం ఉంది. సమ్మోహనం చక్కటి లవ్‌స్టోరి. సుధీర్‌బాబుకు ఈ చిత్రం ఓ మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను. చిత్ర యూనిట్‌కు నా శుభాంకాంక్షలు. గాడ్ బ్లెస్ అని చిరంజీవి ఓ సందేశాన్ని అందజేశారు.


Click it and Unblock the Notifications











