Gaddar పాట ఉన్నంత కాలం ప్రజల హృదయంలో గద్దర్.. చిరంజీవి, బాలకృష్ణ, ప్రియాంక గాంధీ సంతాపం..

గత 50 ఏళ్లుగా ప్రజా సమస్యలపై గళమెత్తిన ప్రజా యుద్ద నౌక గద్దర్ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ ఆగస్టు 6వ తేదీన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో సినీ, సంగీత లోకం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ..

ప్రియాంక గాంధీ సంతాపం.. :నిరంతర పోరాట యోధుడు, గొప్ప గాయకుడు గుమ్మడి విఠల్ రావు గారు ఇకలేరనే వార్తతో విషాదంలో మునిగిపోయాం. ప్రజా సమస్యలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం నిజంగా స్పూర్తిదాయకం. ఆయన పోరాటం ఎన్నో లక్షల మంది హృదయాల్లో ఉద్యమ స్పూర్తిని నిలిపింది. మార్పు కోసం ఆయన చేసిన పోరాటం, ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రియాంక గాంధీ అన్నారు.

Mega Star Chiranjeevi, Nandamuri Balakrishna, Priyanka Gandhi, Sai Dharam Tej condolence on Gaddar Death

మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం:గద్దర్ మరణ వార్తతో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. గద్దర్ గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్నకు లాల్ సలాం ! 🙏🙏

సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటల తో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది.
ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు ,లక్షలాది ఆయన అభిమానులకు , శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం ! అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Mega Star Chiranjeevi, Nandamuri Balakrishna, Priyanka Gandhi, Sai Dharam Tej condolence on Gaddar Death

గద్దర్ ఓ విప్లవశక్తి.. బాలకృష్ణ:తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని నందమూరి బాలకృష్ణ తన సంతాప ప్రకటనలో తెలిపారు.

అన్నమయ్య.. రామదాసు అంటూ :గద్దర్ మరణవార్తతో విప్లవ చిత్రాల నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఎమోషనల్ అయ్యారు. ప్రజా యుద్ధ నౌక సేవలను గుర్తుంచుకొంటూ శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్బంగా.. ఒక అన్నమయ్య పుట్టారు..దివంగతులయ్యారు. ఒక రామదాసు పుట్టారు...దివంగతులయ్యారు. ఒక పాల్ రబ్సన్ పుట్టారు...దివంగతులయ్యారు. ఒక గద్దర్ పుట్టారు...డివంగతులయ్యారు. ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

Mega Star Chiranjeevi, Nandamuri Balakrishna, Priyanka Gandhi, Sai Dharam Tej condolence on Gaddar Death

పల్లెపాట మీద ప్రేమ:గద్దర్ మరణంపై సంతాపం ప్రకటిస్తూ.. పల్లె పాట మీద ప్రేమ ప్రేమ పెంచుకున్నారు.

జనం పాటను గుండెకు హత్తుకున్నారు. పోరుపాటను ఎగిరే ఎర్రజెండా కు అద్దిన, ప్రజల గుండె గొంతుక ప్రజా యుద్ధనౌక అందించిన స్పూర్తి. నీ సేవలను చరిత్ర మరవదు..
గద్దరన్న ఏ లోకంలో ఉన్నా.. అన్న పాట అన్ని కాలాల్లో వినిపిస్తునే ఉంటుంది.. జోహార్ గద్దరన్న అని దర్శకుడు ఎన్ శంకర్ ఓ ప్రకటనలో తెలిపారు.

పాట ఉన్నంత కాలం గద్దర్ ఉంటారు:గద్దర్ మరణంతో హీరో సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యాడు. ప్రజల కోసం, ప్రజల నుంచి పుట్టిన మనిసి గద్దర్ లేరనే విషయంతో విషాదంలో మునిగిపోయాను. ఆయన పాటలు సిద్దాంతాలతో చిరకాలం నిలిచిపోతారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం అని ట్విట్టర్ సంతాపంలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X