‘భరత్ అనే నేను’లో చిరంజీవి మెచ్చిన సీన్ ఏంటో తెలుసా?

By Bojja Kumar

మెగాస్టార్ చిరంజీవి 'భరత్ అనే నేను' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రవాస భారతీయులను కలిసేందుకు అమెరికా వెళ్లిన ఆయన ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ప్రస్తావించారు. ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందన్నారు.

మహేష్ బాబు అంటే తమ ఫ్యామిలీలో అందరికీ ఎంతో ఇష్టమని చెప్పిన మెగాస్టార్, 'భరత్ అనే నేను' చిత్రాన్ని తొలి రోజు మా ఇంట్లోనే చూశామని వెల్లడించారు. దర్శకుడు కొరటాల శివ సినిమాను ఎంతో అద్భుతంగా తీశారని, అనవసర కమర్షియల్ అంశాలు జోడించకకుండా కథకు ఏదైతే అవసరమో అంత వరకే తీసుకుని ఎంతో చక్కగా రూపొందించారని తెలిపారు.

 Mega Star Chiranjeevi On Bharat Ane Nenu

సినిమా చూసిన వెంటనే మహేష్ బాబుకు ఫోన్ చేసి అభినందించానని చిరంజీవి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాలో తనకు చివర్లో వచ్చే ప్రెస్ మీట్ సీన్ చాలా నచ్చిందని, నేను స్వతహాగా ఆ సీన్‌కు కనెక్ట్‌ అయ్యానని, మహేష్ జర్నలిస్టులను ప్రశ్నిస్తున్నప్పుడు చప్పట్లు కూడా కొట్టానని, అది ఎంతో అద్భుతంగా సీన్ అంటూ మెచ్చుకున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు తొలిసారి ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. తొలి రోజు నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ బాక్సాఫీసు వద్ద రూ. 200 కోట్లు వసూలు చేసే దిశగా దూసుకెళుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X