twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున నాకు పెద్ద పరీక్షే పెట్టాడు?.. ఆ ప్రశ్నలు వెంటాడుతాయి, కానీ!: 'హలో'పై చిరంజీవి..

    |

    Recommended Video

    రాంచరణ్-అఖిల్ అలా పిలుచుకుంటారు !

    అనుకున్నట్లే హలో ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్‌ను దించారు. సినిమా గురించి, అఖిల్ పెర్ఫామెన్స్ గురించి ఆయన ఆకాశానికెత్తేశారు. చిరంజీవి అఖిల్ ను పొడుగుతుంటే నాగార్జున కళ్లలో ఆనందం స్పష్టంగా కనిపించింది.

    తెరంగేట్రం చేసిన తొలి సినిమా ఫ్లాప్ అవడంతో.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నాడు అఖిల్. ఇప్పుడు చిరంజీవి ద్వారా సినిమాపై మరింత ఎటెన్షన్ క్రియేట్ చేసేశారు. డిసెంబర్ 22న వస్తున్న ఈ సినిమా ప్రి రీలీజ్ వేడుక గురించి మరిన్ని విశేషాలు..

    అక్కినేని కుటుంబానికి 'హలో' అనుబంధం:

    అక్కినేని కుటుంబానికి 'హలో' అనుబంధం:

    "తరాలుగా అందరి నోళ్లలో నానుతున్న పదం 'హలో'. ఆ మాటకీ అక్కినేని కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు 'హలో హలో...' అంటూ సాగిపోయే పాట పాడారు. ఆ తర్వాత నాగార్జున, అమల 'హలో గురూ...' అని పాడుకున్నారు. నాగార్జున హీరోగా 'హలోబ్రదర్‌' అనే సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు అఖిల్‌ కూడా 'హలో' అంటూ వచ్చేస్తున్నాడు."-చిరంజీవి

    అఖిల్ 'బంగారం':

    అఖిల్ 'బంగారం':

    'మనం' చిత్రాన్ని చరిత్రలో నిలిచిపోయేలా తెరకెక్కించిన విక్రమ్‌, అదే స్థాయిలో 'హలో' ప్రేమ కథని తెరకెక్కించాడన్నారు చిరంజీవి. అఖిల్‌ ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కుతాడన్నారు.

    వినయంలో, సంస్కారంలో అఖిల్ బంగారం అన్నారు చిరంజీవి. అలాంటి బంగారాన్ని కన్నందుకు గాను అమలను,నాగార్జునను అభినందించారు .

    'హలో' కోసం ఎవరిని దించుతున్నారో తెలుసా?, ఈసారి బాక్స్ బద్దలైపోవాల్సిందే?.. <br /> 'హలో' కోసం ఎవరిని దించుతున్నారో తెలుసా?, ఈసారి బాక్స్ బద్దలైపోవాల్సిందే?..

    అదో పరీక్షలాంటిదే:

    అదో పరీక్షలాంటిదే:

    సినిమా విడుదల కాకముందే చూడటం ఓ పరీక్ష లాంటిదన్నారు చిరంజీవి. బాగుంటుందా? ఉండదా? చూశాక ఎలా స్పందించాలి? లాంటి ప్రశ్నలు వెంటాడుతాయన్నారు. ఒకరకంగా రిలీజ్‌కు ముందే సినిమా చూపించి నాగార్జున తనకు పరీక్ష పెట్టాడన్న తరహాలో చిరంజీవి వ్యాఖ్యలు చేశారు.

    ఆల్ క్లాస్ సినిమా

    ఆల్ క్లాస్ సినిమా

    సినిమా చూసి ఎలా స్పందించాలో తెలియలేదని, కానీ ఒక అద్భుతమైన, స్వచ్చమైన ప్రేమ కథను చూసిన ఫీలింగ్ కలిగిందన్నారు. క్లాస్, మాస్ అందరినీ ఆకట్టుకునేలా 'హలో' సినిమా ఆల్ క్లాస్ సినిమా అవుతుందన్నారు.

    అప్పుడే ఆశ్చర్యపోయాను:

    అప్పుడే ఆశ్చర్యపోయాను:

    తాను అఖిల్ మొదటి సినిమా చూసినప్పుడే అతని పెర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయానని చిరంజీవి అన్నారు. ఇక 'హలో' విషయానికొస్తే నటుడిగా అఖిల్ అద్భుతంగా నటించాడన్నారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరి గుండెను తాకుతుందన్నారు.

    తండ్రిని మంచిన తనయుడు:

    తండ్రిని మంచిన తనయుడు:

    అఖిల్ గురించి చెబుతూ.. అతనిలో తాత గారి జీన్స్ ఉన్నాయన్నారు చిరంజీవి. అఖిల్ అటు తాతను, ఇటు తండ్రిని మించిన తనయుడు అయ్యాడని పేర్కొనడం విశేషం.

    English summary
    Megastar Chiranjeevi was the special attraction to Hello pre release event, He said after this movie Akhil definitely become an wonderful actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X