అందరికీ తెరవెనుక దాసరి స్ఫూర్తి.. ఇంకా సాధించాలనిపిస్తుంది.. చిరంజీవి
దర్శకరత్న దాసరి నారాయణ రావు పైన ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు రూపొందించిన 'తెరవెనుక దాసరి' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నాడు సిని ప్రముఖులు, దాసరి శిష్యులు, దాసరి కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, టి సుబ్బిరామిరెడ్డి, మురళి మోహన్, ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖులు పలువురు రాసిన వ్యాసాల సంకలనంగా ఈ పుస్తకం రూపొందింది.
Recommended Video

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇలాంటి పుస్తకం ఒకటి వస్తుందని తెలియగానే చాలా సంతోషం అనిపించింది. ఈ కార్యక్రమం ఎలా చెయ్యాలి అని ఆలోచించినప్పుడు దాసరి అంటే ఒక రేంజ్ ఆ రేంజ్లో ఈ కార్యక్రమం చెయ్యాలి అని అనుకొన్నాను. నిర్మాత టీ సుబ్బిరామిరెడ్డికి ఈ కార్యక్రమం గురించి చెప్పడంతో అతను ఇంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. నేనేదో సాధించాను అనుకుని ఈ పుస్తకం చదివితే ఇంకా ఏదో సాధించాలి అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళకే కాదు సినిమాని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఈ పుస్తకం తెరిస్తే మళ్ళి కొత్తగా ఇంకా ఏదో సాధించాలి అనే ఆలోచనల్లో పడతారు అంటు పుస్తకంలో వున్నా అంశాలను గురించి వివరించారు.


Click it and Unblock the Notifications











