Laal Singh Chaddhaకి ఫిదా.. కెరీర్లో మొట్టమొదటి సారి ఆ పని చేయడానికి సిద్దమైన చిరు!
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసింది. చివరిగా ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చి భారీ డిజాస్టర్ మూట కట్టుకున్న చిరంజీవి ప్రస్తుతం మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లోనే ఎప్పుడూ చేయని పని చేయడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కన్నీళ్లు కూడా
మెగాస్టార్ చిరంజీవి లాల్ సింగ్ చద్దా అనే సినిమా ప్రివ్యూ తన ఇంట్లో చూసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరో అమీర్ ఖాన్ సినిమాని మెగాస్టార్ చిరంజీవికి స్పెషల్ షో వేసి చూపించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు సుకుమార్, రాజమౌళి, హీరోలు నాగార్జున, నాగచైతన్య కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా అద్భుతంగా ఉందని చెబుతూ అమీర్ ఖాన్ ను హత్తుకోవడంతో అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. వెంటనే కన్నీళ్లు కూడా పెట్టుకున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇబ్బంది లేదని
అయితే తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసి అద్భుతంగా ఉందని మెచ్చుకుంటూ ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయాల్సిందిగా అమీర్ ఖాన్ ను కోరారట. అమీర్ ఖాన్ దానికి సంసిద్ధత వ్యక్తం చేయడమే కాకుండా మీరు తెలుగులో విడుదల చేస్తానంటే కచ్చితంగా తాను రిలీజ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారట.

వాటాలు ఏమైనా
వెంటనే చిరంజీవి కూడా ఇలాంటి రెండో ఆలోచన లేకుండా తాను సినిమాను ప్రమోట్ చేస్తానని ఇలాంటి సినిమా కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు కూడా కావాలని అన్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా ఒక సినిమాని సమర్పించబోతున్నారు. అయితే ఇందులో ఆయన వాటాలు ఏమైనా తీసుకుంటారా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి సమర్పించు లాల్ సింగ్ చద్దా అంటూ టైటిల్ మాత్రం వేయబోతున్నారు.

కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా
ఇక ఇప్పటిదాకా మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారి కూడా సినిమాను సమర్పించలేదు కానీ ఆయన భార్య మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొన్ని సినిమాలకు సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పేరిట రూపొందుతున్న అన్ని సినిమాలకు కొణిదల సురేఖ సమర్పించు అనే పడుతుంది. ఇక మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా సినిమా సమర్పించబోతున్నారని విషయం తెలిసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మత్స్యకారుడుగా
ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ లో తాజాగా రవితేజ కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఈ సినిమాలో రవితేజ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో ఆయన ఒక మత్స్యకారుడుగా కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది.


Click it and Unblock the Notifications











