మెగా టాక్: జీవిత ఇబ్బంది పెడితే? పవర్ స్టార్ అండ!
హైదరాబాద్: కేంద్రంలో కొత్త సెన్సార్ బోర్డు కొలువు తీరిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు కొత్త చైర్ పర్సన్‌గా పహ్లాజ్ నిహలానీ నియమితులయ్యారు. దీంతో పాటు తొమ్మిది మంది కొత్త మెంబర్స్ నియమితులయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటి జీవితకు కూడా సెన్సార్ బోర్డు సభ్యుల్లో స్థానం దక్కింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
బీజేపీకి మద్దతుగా ఉన్న జీవితకు సెన్సార్ బోర్డు పదవి రావడంతో ఇందులో రాజకీయ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారు. కాగా జీవితకు సెన్సార్ బోర్డు పదవి రావడంపై మెగా ఫ్యామిలీ అభిమానుల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఇందుకు కారణం మెగాస్టార్ చిరంజీవికి, జీవితరాజశేఖర్ దంపతుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి గతంలో ఉండటమే.

అప్పట్లో పలు కారణాలతో మొదలైన గొడవ చాలా ఏళ్ల పాటు సాగింది. అనేక సందర్భాల్లో జవిత, రాజశేఖర్ ఇంటర్వ్యూలు పెట్టి మరీ చిరంజీవిపై విమర్శలు చేసారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వ్యవహారాలను మీడియాకు ఈడ్చారు. తాజాగా జీవిత చేతికి సెన్సార్ బోర్డు పదవి రావడం చర్చనీయాంశం అయింది.
ఈ నేపథ్యంలో ఆమె భవిష్యత్తులో మెగా ప్యామిలీ హీరోల సినిమాల సెన్సార్ విషయంలో ఏమైనా ఇబ్బందులు పెడుతుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ ఉంటుంది కాబట్టి అలాంటి ఆందోళన అవసరం లేదని అంటున్నారు మరికొందరు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి, మోడీకి బలమైన మద్దతు దారుడనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











