twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తల్లి ప్రాణాల కోసం చివరిదాకా వేడుకున్న దర్శకుడు.. ఆఖరికి 'సారీ రా' అనేసిన సాయి ధరమ్ తేజ్

    |

    కరోనా విలయతాండవం అస్సలు తగ్గడం లేదు. ఉన్నోడు లెనోడు అని తేడా లేకుండా కరోనా దెబ్బ ఎన్నో జీవితాల్లో విషాధాలు నింపుతోంది. ఎంత పలుకుబడి ఉన్నా కూడా సమయానికి సహాయం అందడం లేదు. ఐసియు బెడ్స్ ఆక్సిజన్ అనేది ఇప్పుడు దేశమంతా ముఖ్యమైన ఆయుధంలా మారింది. ఇక ఇటీవల ఒక దర్శకుడు తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి అన్ని వైపులా ప్రయత్నాలు చేశాడు. కానీ ఫలితం దక్కలేదు.

    ఈ రేంజ్ లో కరోనా షాక్ ఇస్తుందని..

    ఈ రేంజ్ లో కరోనా షాక్ ఇస్తుందని..

    కరోనా సెకండ్ వేవ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఫస్ట్ వేవ్ తీవ్రత పెరుగుతున్న సమయంలో ప్రాణాల నుంచి బయటపడిన వారి సంఖ్య చాలానే ఉంది. అయితే సెకండ్ వేవ్ లో మాత్రం కనీసం ఛాన్స్ కూడా దొరకడం లేదు. రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రేంజ్ లో కరోనా షాక్ ఇస్తుందని ఎవరు ఊహీంచలేదు.

    మెగా హీరోతో వర్క్ చేసిన దర్శకుడు

    మెగా హీరోతో వర్క్ చేసిన దర్శకుడు

    కరోనా బారిన పడుతున్న వారికి ఎక్కువగా సాధారణ వ్యక్తులే అండగా నిలుస్తున్నారు. అవసరమైన క్రమంలో ఆక్సిజన్ బెడ్స్ అందిస్తున్నారు. కానీ కొన్నిసార్లు సెలబ్రెటీలకు కూడా ఆక్సిజన్ బెడ్స్ అందక ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. రీసెంట్ గా మెగా హీరోతో వర్క్ చేసిన దర్శకుడు కూడా తన తల్లికి కరోనా సోకడంతో ఐసీయు బెడ్స్ కోసం తీవ్రంగా శ్రమించాడు.

    మొదటి విజయం దక్కిన కొన్ని రోజుల్లోనే

    మొదటి విజయం దక్కిన కొన్ని రోజుల్లోనే

    దర్శకుడు సుబ్బు యువ హీరో సాయి ధరమ్ తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేశాడు. మెగా హీరోలతో అతనికి మంచి సాన్నిహిత్యం ఉంది. గత ఏడాది లాక్ డౌన్ అనంతరం విడుదలైన మొదటి సినిమా ఇతనిదే కావడంతో మంచి గుర్తింపు అందుకున్నాడు. సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే మొదటి విజయం దక్కిన కొన్ని రోజుల్లోనే సుబ్బు ఇంట్లొ కరోనా విషాదాన్ని నింపింది.

    ఆ ప్రయత్నంలోనే సుబ్బు తల్లి మరణించింది.

    ఆ ప్రయత్నంలోనే సుబ్బు తల్లి మరణించింది.

    సుబ్బు తల్లి మంగమ్మకు ఇటీవల కరోనా పాజిటివ్ అని తెలియడంతో వెంటనే హాస్పిటల్ జాయిన్ చెయ్యాలని అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా కనీసం బెడ్స్ లేని పరిస్థితి. ఆక్సిజన్ కూడా దొరకలేదు. సాయి ధరమ్ తేజ్ కూడా తన శక్తి మేర అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నంలోనే సుబ్బు తల్లి మరణించింది.

    Recommended Video

    Vijay Devarakonda Birthday : టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా రికార్డు | Liger Teaser || Filmibeat Telugu
    సాయి ధరమ్ తేజ్ క్షమాపణ

    సాయి ధరమ్ తేజ్ క్షమాపణ


    సుబ్బు తల్లి మరణించగానే సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా ఎమోషన్ గా ట్వీట్ చేశాడు. ఆమె ఇక లేరు. క్షమించు రా సుబ్బు.. ఓం శాంతి.. అంటూ సాటి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. మెగా ఫ్యామిలీకి చెందిన వారి వల్లే సహాయం అందలేదు అంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది.. అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

    English summary
    Subbu's mother Mangamma recently found out that Corona was positive and wanted to join the hospital immediately. But nowhere near the situation of at least no beds. Oxygen was also not found. Sai Dharam Tej also made efforts from all sides to the best of his ability. But Subbu's mother died in the attempt.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X