లవ్ పాకిస్థాన్... అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, ఇది వాళ్ల పనే!

Recommended Video

Amitabh Bachchan Becomes Victim Of Cyber Crime || Filmibeat Telugu

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ హ్యాక్ అయింది. టర్కీకి చెందిన హ్యాకర్లు ఆయన అకౌంట్ సోమవారం హ్యాక్ చేశారు. ఆయన డిస్‌ప్లే పిక్చర్ పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫోటోతో రీప్లేస్ చేయడంతో పాటు ''లవ్ పాకిస్థాన్' అనే పోస్ట్ పెట్టారు.

కోట్లాది మంది ఫాలోవర్స్ కలిగిన అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్లో ఇలాంటి పోస్టులు దర్శనమివ్వడంతో ఏం జరుగుతుందో తెలియక అంతా మొదట అయోమయానికి గురయ్యారు. మరో పోస్టులో భారతీయులను దూషిస్తూ మరో ట్వీట్ కనిపించడంతో ఇది హ్యాకర్ల పనే అని అర్థమైంది.

హ్యాక్ అయిన తర్వాత ఇలా...

హ్యాక్ అయిన తర్వాత ఇలా...

అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన తర్వాత ఆయన డిపి(డిస్‌ప్లే ఇమేజ్) పై విధంగా దర్శనమిచ్చింది. బిగ్ బి లాంటి టాప్ సెలబ్రిటీలను టార్గెట్ చేయడం ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా హ్యాకర్లు ఇలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఇంటర్నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయింది.

ముస్లింలపై దాడులు జరుగుతున్నాయంటూ...

ముస్లింలపై దాడులు జరుగుతున్నాయంటూ...

రంజాన్ ఉపావాసాల సమయంలో కూడా కనికరం లేకుండా ముస్లింలపై దాడులు జరిగాయంటే మరో ట్వీట్లో హ్యాకర్లు పేర్కొన్నారు. ఎలాంటి దాడులు జరుగక పోయినా... భారత దేశంలో అలజడి రేపేందుకే హ్యాకర్లు అమితాబ్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇలా అబద్దపు ప్రచారం చేసినట్లు స్పష్టమవుతోంది.

టర్కిష్ సైబర్ ఆర్మీ

టర్కిష్ సైబర్ ఆర్మీ

టర్కిష్ సైబర్ ఆర్మీ పేరుతో అమితాబ్ బచ్చన్ అకౌంట్లో ఈ పోస్టులు దర్శనమిచ్చారు. ఈ ఘటనపై వెంటనే ట్విటర్ట్ యాజమాన్యం స్పందించింది. దిద్దుబాటు చర్యలు చేపట్టి ఆయన అకౌంట్ నుంచి హ్యాకర్ల పోస్టులను తొలగించినట్లు తెలుస్తోంది.

వరుస ఘటనలు

వరుస ఘటనలు

టర్కిష్ హ్యాకర్లు ఈ మధ్య కాలంలో వరుసగా బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ అకౌంట్ హ్యాక్ చేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమణదారుడు కాదని అందులో పేర్కొన్నారు. షాహిద్ కపూర్ నటించిన ‘పద్మావత్' చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూపించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్

ఇండియన్ లెజెండరీ యాక్టర్లలో ఒకరైన అమితాబ్ బచ్చన్... 76 ఏళ్ల వయసులోనూ అలుపు లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన చిత్రాలు ‘మణికర్ణిక', ‘బద్లా' చిత్రాలు విడుదలయ్యాయి. తెలుగు చిత్రం ‘సైరా నరసింహారెడ్డి' షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఝండ్, బ్రహ్మాస్త్ర, తేరా యార్ మూ మే అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X