twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాష్ బ్యాక్: బాహుబలి కంటే ఎక్కువ సమయం.. 'అంజి' కొట్టిన డిజాస్టర్ దెబ్బ!

    |

    బాహుబలి వచ్చిన తరువాత టాలీవుడ్ లో కూడా బిగ్ బడ్జెట్ సినిమాలు నేషనల్ లెవెల్లో తెరకెక్కుతాయని దేశవ్యాప్తంగా ఒక క్లారిటీ వచ్చింది. అయితే బాహుబలి లాంటి ఒక పెద్ద ప్రయత్నాలు ఇంతకుముందు జరిగాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి అంజి సినిమా ఒకటి. ఆ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు మర్చిపోలేని చిత్రం. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ బిగ్ డిజాస్టర్స్ లో అంజి కూడా ఒకటని చెప్పవచ్చు.

     అమ్మోరు తరువాత..

    అమ్మోరు తరువాత..

    మొదటి సారి హై విజువల్ ఎఫెక్ట్స్ కి ఇండియాకు పరిచయం చేసిన ఘనత అమ్మోరు సినిమా ద్వారా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికే దక్కింది. ఆ సినిమాను భారీ ఖర్చులతో రీ షూట్ చేసి మరి రిలీజ్ చేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టడంతో అదే తరహాలో మరో గ్రాఫిక్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు దర్శకనిర్మాతలు. అదే సినిమా అంజి.

    బాహుబలి కంటే ఎక్కువ సమయం..

    బాహుబలి కంటే ఎక్కువ సమయం..

    సాధారణంగా 90ల కాలంలో ఒక సినిమాను పూర్తి చేయడానికి పెద్దగా సమయం పట్టేది కాదు. అయితే బాహుబలి కోసం 5 ఏళ్ళ సమయం పట్టింది అని ఆ సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నారని అందరు అనుకుంటూ ఉంటారు. కానీ 2004లో విడుదలైన అంజి సినిమా పనులన్నీ పూర్తి చేసుకొని రిలీజ్ కావడానికి ఏడేళ్లు పట్టింది. 1997లో సినిమా షూటింగ్ పనులు మొదలవ్వగా 2004 జనవరి 15న సినిమా రిలీజ్ అయ్యింది.

     బిగ్గెస్ట్ డిజాస్టర్స్..

    బిగ్గెస్ట్ డిజాస్టర్స్..

    ఆ సినిమా విడుదలయ్యాక ఎందుకో గాని మెగాస్టార్ ఫాంటసీ యాక్షన్ ని అప్పట్లో జనాలు మెచ్చుకోలేదు. గ్రాఫిక్స్ పనుల కోసం అమ్మోరు అందించిన లాభాలను నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంజి సినిమా కోసమే ఖర్చు చేశారు. దాదాపు 27కోట్ల వరకు ఖర్చు చేశారట. కానీ సినిమా సగానికి పైగా నష్టాలను మిగిల్చగా నిర్మాత కొలుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఇక అరుంధతి సినిమాతో మంచి లాభాలను అందుకున్న ఆయన మళ్ళీ రిస్క్ చేయకూడదని సినిమాల వైపు చూడలేదు.

    Recommended Video

    RRR Movie Release May Postpone Again Because Of Chiranjeevi
    దెబ్బ కొట్టినా... ఆ సినిమా స్పెషల్..

    దెబ్బ కొట్టినా... ఆ సినిమా స్పెషల్..

    అంజి సినిమా అంతగా ఆడకపోయినా చాలా ఈ కాలంలో చాలా మందికి ఆ సినిమా నచ్చుతుంది. ఇక దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కూడా ఆయనకు ఆల్ టైమ్ బెస్ట్ సినిమాల్లో అంజి ఒకటని అంటారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా ఆ సినిమా తనకు ఎన్నో పాఠాలు, పనిని నేర్పిందని చెబుతుంటారు. ఇక అంజి సినిమాకు అప్పట్లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ క్యాటగిరిలో నేషనల్ అవార్డ్ దక్కింది.

    English summary
    Megastar anji movie production work throwback news. Anji movie released in 2004 took seven years to complete and release. Director kodi ramakrishna all time favorite movie, The film was made on a budget of 28 crore, and was officially launched on May 1997.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X