twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఉయ్యాలవాడ’కు అన్యాయం.. చిరంజీవి న్యాయం చేస్తారా?.. కథలు కథలుగా..

    రెండేళ్ల నుంచి బుల్లి తెరకు దూరంగా ఉన్న తొలిసారిగా తన కవల పిల్లలతో తళుక్కున మెరిసింది యాంకర్ ఉదయ భాను.

    By Rajababu
    |

    పదేండ్ల గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన సత్తా తగ్గలేదని నిరూపించారు. అదే జోష్, అదే ఊపుతో యువ హీరోలకు సైతం దిమ్మతిరిగేలా స్టెప్పులు, గ్రేస్‌తో ఆలరించాడు. ప్రస్తుతం 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితగాథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించకముందే ఉయ్యాలవాడ రియల్ స్టోరిని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు, ప్రతిపాదనలు మెగాస్టార్ ముందుకు వచ్చాయి. అయితే రాజకీయాల్లో బిజీగా ఉండటం కారణంగా ఈ సినిమాను తెరకెక్కించలేకపోయారు. సుమారు పదేండ్లపాటు ఆ చిత్ర కథను తెరకెక్కించడానికి ఏ హీరో కూడా సాహసం చేయకపోవడంతో మళ్లీ ఆ అవకాశం మెగాస్టర్ ముందుకు వచ్చింది.

    అక్షరరూపం లేని ఉయ్యాలవాడ..

    అక్షరరూపం లేని ఉయ్యాలవాడ..

    ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథకు సంబంధించిన రచనలు, నవలలు గానీ అచ్చు రూపంలో ఉన్న దాఖలాలు కనిపించినట్టు లేవు. రాయలసీమలో కొందరు చెప్పుకొనే కథనే ఉయ్యాలవాడకు ఆధారం. అయితే రాయలసీమ ప్రజలకు, యువతకు ఉయ్యాలవాడ జీవితం ఓ స్ఫూర్తి. ఉయ్యాలవాడను రాయలసీమ ప్రాంతం వాళ్లు విపరీతంగా అభిమానిస్తారు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌లో అటు కోస్తాంధ్ర గానీ, ఇటు తెలంగాణలో గానీ ఉయ్యాలవాడ నరసింహరెడ్డి గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువే అని చెప్పవచ్చు. సినిమాగా రూపొందుతున్న ఈ కథపై ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.

    అసలు ఏంటా కథ...

    అసలు ఏంటా కథ...

    ఇంటర్నెట్, సోషల్ మీడియాలో సేకరించిన సమాచారం ప్రకారం.. సైనిక తిరుగుబాటుకు దాదాపు 10 సంవత్సరాల ముందే అంటే సుమారు 1847 కాలంలోనే ఉయ్యాలవాడ కథ జరిగినట్లు చరిత్ర చెపుతున్నది. నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వల్ల తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు అనంతరపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నర్మించిన కోటలు నగరులు ఈనాటికీ ఉన్నాయి.

    భరణం తిరస్కరించడంతో ఉద్యమం..

    భరణం తిరస్కరించడంతో ఉద్యమం..

    1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం ఇప్పించమని తన అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపితే తహసీల్దారు తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తామని తిప్పి పంపించడంతో నరసింహరెడ్డిలో తిరుగుబాటు మొదలైంది. నరసింహారెడ్డికి ఇవ్వవలసిన దాదాపు రూ.11 భరణాన్ని అతని అనుచరునికి ఇచ్చి పంపేందుకు బ్రిటీష్ తహసీల్దారు తిరస్కరించడంతో ఉయ్యాలవాడ అవమానంగా భావించారట. బ్రిటీష్ వలస పాలకులపై సమరనాదం మోగించి పోరాటానికి నరసింహారెడ్డి సిద్ధమయ్యాడు.

    బోయలతో ఉధృతంగా పోరాటం

    బోయలతో ఉధృతంగా పోరాటం

    స్థానికంగా ఉన్న ఇతర జమీందార్లు, బోయలు, చెంచులను పోరాటంలో సమన్వయం చేసి పోరాటాన్ని ఉధృతం చేశాడు. 1846 జులై 10 తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకున్నట్టు చరిత్ర ఆధారాలున్నాయి. బ్రిటీష్ అధికార భవనాలపై దాడులు, ఖజానాలను కొల్లగొట్టడం లాంటి వ్యూహాలతో స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించాడు. అనేక వీరోచిత దాడుల తర్వాత దొంగదెబ్బ తీసి నరసింహరెడ్డిని బంధిస్తాయి.

    బహిరంగ ఉరి..

    బహిరంగ ఉరి..

    1846 అక్టోబర్‌ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్‌ కలెక్టర్‌ కాక్రేన్‌ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించాడు. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద బహిరంగంగా ఉరితీసినట్టు చరిత్ర ఆనవాళ్లు ఉన్నట్టు రాయలసీమ ప్రాంతంవారు చెప్పుకొంటారు. భవిష్యత్‌లో బ్రిటీష్ పాలకులపై ఎవరు కూడా ఈ తరహా పోరాటాలు చేయకుండా, అసలు అలాంటి ఆలోచన రాకూడదనే విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఉరి అనంతరం నరసింహారెడ్డి తలను 1877 వరకు అంటే 30 ఏళ్ళపాటు రాయలసీమ ప్రాంతంలోని కోయిలకుంట్లలోని ఉరికొయ్యకు వేలాడదీసి ఉంచారు.

    ప్రభుత్వాల నిర్లక్ష్యం..

    ప్రభుత్వాల నిర్లక్ష్యం..

    ఇంతటి ఘన చరిత్ర ఉన్న వీరుడి కథను రచనగా మలచాలనే ధ్యాస, ఆలోచన ఏ ప్రభుత్వానికి రాలేదు. ఆ ప్రాంత నాయకులకు ఆలోచన రాకపోవడం శోచనీయం. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్రకు అక్షరరూపం కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయేన వాదన వినిపిస్తున్నది. ఆ కారణంగానే ఎన్నో ఏళ్లుగా గొప్ప ఉద్యమ వీరుడి కథ వెలుగులోకి రాకుండా ఉంది. ఇప్పటివరకు మరుగునపడిన ఉయ్యాలవాడ కనీసం సినిమాగానైనా వస్తే తెలుగు ప్రజలందరిలో ఉద్యమ స్ఫూర్తిని, దేశభక్తిని నింపుతాడని ఆశిద్దాం

    ఉయ్యాలవాడపై మెగాస్టార్ కసరత్తు..

    ఉయ్యాలవాడపై మెగాస్టార్ కసరత్తు..

    ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించేందుకు మెగాస్టార్ కసరత్తు చేస్తున్నారు. ఇటీవల మీలో ఎవరు కోటీశ్వరుడు చిత్రంలో కూడా ఉయ్యాలవాడ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సినిమా గురించిన చర్చలు, స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతున్నదనే విషయంపై అనేక వార్తలు వస్తున్నాయి.

    పరుచూరి బ్రదర్స్..

    పరుచూరి బ్రదర్స్..

    సినిమాగా తెరకెక్కించే ఉయ్యాలవాడ నరసింహరెడ్డిలో శ్రీకాంత్, వెంకటేష్‌లు నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ కథకు పరుచూరి బ్రదర్స్ పదను పెడుతున్నట్టు సమాచారం. వినోదం, యాక్షన్‌ను మేలవించి తెరకెక్కించేందుకు ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు కంటే ముందే తొలితరం తెలుగు తిరుగుబాటుదారుడు, స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో చిరంజీవి మరోసారి తెలుగు తెరపై విజృంభించేందుకు సిద్ధమవుతున్నారు.

    చిరంజీవికి అది సరికాదు.

    చిరంజీవికి అది సరికాదు.

    చిరంజీవి సినిమా విడుదలై దాదాపు నాలుగు నెలలు కావొస్తున్నది. ఒకవేళ రెండు నెలల తర్వాత ఈ సినిమా సెట్‌పైకి వెళ్తే తప్ప మరో నాలుగు నెలల తర్వాత సినిమా విడుదలయ్యే అవకాశమే ఉండదు. అంటే ఖైదీ నంబర్ 150కి ఉయ్యాలవాడకు మధ్య అటు, ఇటు కలిపి 10 నెలల గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ చిరంజీవికి సరికాదనే వాదన వినిపిస్తున్నది.

    ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజి బిజీ

    ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజి బిజీ

    రామ్‌ చరణ్‌ హీరోగా 'ధృవ'లాంటి క్లాస్‌ హిట్‌ను అందించిన సురేందర్‌‌రెడ్డి మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ కొట్టేశాడు. చిరంజీవి ఏప్రిల్‌ మొదటి వారంలో ఈ సినిమా ప్రారంభించాలని భావించినా ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాలేదు. అందుకే దాన్ని జూన్‌కు వాయిదా వేశారు. స్వతంత్ర సమరయోధుడి జీవిత కథ కావడంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం తమన్‌, దర్శకుడు సురేందర్‌రెడ్డి తమ పనుల్లో బిజీగా ఉన్నారు.

    English summary
    Megastar Chiranjeevi is gearing up for his 151th film Uyyalawada Narsimha Reddy. Surender Reddy is directing the film and Thaman is giving music for historical movie. This movie story is rounding in Internet. movie slated to go on the shoot in June.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X