»   » హాట్ టాపిక్ : చిరంజీవి 150వ సినిమా

హాట్ టాపిక్ : చిరంజీవి 150వ సినిమా

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా ఎప్పుడు చేస్తారో అంటూ అభిమానులంతా చాలా కాలం నుంచి కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తనకు సినిమా చేసే సమయం లేక పోయినా, వారిని నొప్పించకుండా ఉండటానికి తనకు సూటయ్యే మంచి కథ దొరకితే చూద్దాం, సమయం అనుకూలిస్తే చేద్దాం అని కహానీలు చెబుతూ కొంత కాలం నెట్టుకొచ్చే ప్రయత్నం చేసారు చిరు.

    చిరంజీవి రాజకీయాల్లో బిజీ కావడంతో 150వ సినిమా అంశం....మరుగున పడి పోయింది. అయితే మళ్లీ చిరంజీవి 150వ సినిమా హాట్ టాపిక్ అయింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ విషయంపై మళ్లీ విస్తృత చర్చ సాగుతోంది. చిరంజీవి 150వ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి ఈ ప్రచారంపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి?

    కొన్ని నెలల క్రితం బెంగుళూరులో చిరంజీవి మాట్లాడుతూ...చక్కని సందేశంతో కూడిన సామాజిక విలువలున్న కథ దొరికితే నటించడానికి నేను సిద్దమే అని, సోనియా గాంధీ అనుమతితో 150వ సినిమా చేస్తానని తెలిపారు. మరి చిరంజీవి సినిమా వచ్చే దెప్పుడో..? మనం చూసే దెప్పుడో..?

    ప్రస్తుతం చిరంజీవి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికల వరకు ఆయన ఫుల్ బిజీ. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేసే వీలు ఆయనకు దొరకడం అసంభవం. 2014 ఎన్నికల తర్వాత అయినా చిరంజీవికి సినిమాలపై దృష్టి సారించే అవకాశం ఉందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి. చేస్తే మాత్రం ఆ సినిమాను తానే నిర్మిస్తానని చిరు తనయుడు రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

    English summary
    The talk about Chiranjeevi and his 150th film has been happening since ages and at one point, many dropped the topic. But now, this seems to have come up again as sources close to mega camp reveal that the megastar does have some plans to don the greasepaint.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more