చిరంజీవి, దిల్ రాజు కాంబినేషన్లో సినిమా రాబోతోంది, ఎప్పుడంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయాలని ఇండస్ట్రీలోని ప్రతి యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, టెక్నీషియన్ కోరుకుంటారు. అయితే ఈ అవకాశం ఇప్పటికీ కొందరు టాప్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు దక్కలేదు. ఆ ఛాన్స్ కోసం ఎదరు చూస్తున్న వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఒకరు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు అందరు టాప్ యాక్టర్లతో సినిమాలు చేసిన దిల్ రాజు... మెగాస్టార్ చిరంజీవితో మాత్రం సినిమా చేయలేదు. ఆయనతో ఒక మంచి సినిమా చేయడం కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవికి సూటయ్యే కథ ఒకటి తన వద్దకు రావడంతో బాస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఇటీవల చిరంజీవిని దిల్ రాజు మీట్ అయ్యారని, తన వద్ద ఉన్న కథ గురించి చెప్పినట్లు సమాచారం. మెగాస్టార్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాన్ని పూర్థి స్థాయిలో డెవలప్ చేయించే పనిలో ఉన్నారట.

Megastar Chiranjeevi 153rd film in Dil Raju banner

అంతా అనుకున్నట్లు జరిగితే.... మెగాస్టార్ 153వ చిత్రంగా ఇది ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం చిరంజీవి తన 151వ మూవీ 'సైరా నరసింహారెడ్డి' చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 152వ చిత్రానికి కమిట్ అయ్యారు.

'సైరా నరసింహారెడ్డి' మూవీ విషయానికొస్తే... సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ పీరియడ్ ఫిల్మ్ దసరా సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X