Mega156 మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం ప్రారంభం.. ఫస్ట్ లుక్‌తోనే కిర్రాక్
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దసరా పండుగ నిజమైన పర్వదినంగా మారింది. దసరా పండుగ సందర్బాన్ని పురస్కరించుకొని చిరంజీవి, వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న #Mega156 పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఫాంటసీ, అడ్వెంచరస్‌గా రూపొందిన ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా లుక్‌ను దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయగా అభిమానుల్లో క్రేజీగా మారింది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
#Mega156 సినిమా ఫస్ట్ లుక్ వివరాల్లోకి వెలితే.. కొండ కోనల్లో విధ్వంసం ప్రళయం మధ్య త్రిశూలం పొడుచుకొని వచ్చిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అంటూ పోస్టర్‌పై కాప్షన్ పెట్టారు. విజయదశమి సందర్బంగా వదలిన ఈ పోస్టర్ వైరల్‌గా మారడంతో ఊహించని కథతో మెగాస్టార్ వస్తున్నట్టు స్పస్టమైంది.

దసరా పండుగ సందర్బంగా చిరంజీవి సినిమా పూజా కార్యక్రమాలను మొదలుపెట్టి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ఓ కొత్త లోకాన్ని సృష్టించి కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం చేస్తున్నారనే విషయం స్పష్టమైంది. హ్యాపీ దసరా అంటూ అభిమానులకు శుభాకాంక్షలు అందించారు.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి తదితరులు
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యూవీ క్రియేషన్స్
సినిమాటోగ్రఫి: చోటా కే నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్
క్యాస్టూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
సాహిత్యం: శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్


Click it and Unblock the Notifications











